Share News

డిసెంబరు 10 నుంచి 21 వరకు 3వ అఖిల భారత పోలీసు టీ-20 టోర్నీ

ABN , Publish Date - Oct 28 , 2026 | 07:00 AM

రాష్ట్ర పోలీసుశాఖ ఆధ్వర్యంలో మూడవ అఖిల భారత పోలీసు టీ-20 క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహణకు హైదరాబాద్‌ను వేదికగా ఎంపిక చేశారు.

డిసెంబరు 10 నుంచి 21 వరకు 3వ అఖిల భారత పోలీసు టీ-20 టోర్నీ
All India Police T20 Tournament

  • హైదరాబాద్‌ వేదికగా నిర్వహణ

హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పోలీసుశాఖ ఆధ్వర్యంలో మూడవ అఖిల భారత పోలీసు టీ-20 క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహణకు హైదరాబాద్‌ను వేదికగా ఎంపిక చేశారు. వచ్చే డిసెంబరు 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ హైదరాబాద్‌లో ఎంపిక చేసిన 8 క్రికెట్‌ మైదానాల్లో ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంటులో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర పోలీ సు బలగాలకు చెందిన 35 జట్లు పాల్గొంటున్నాయి.


ఈ టోర్నీ నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం పోలీసు ఉన్నతాధికారుల తో డీజీపీ సీవీ ఆనంద్‌ సమీక్షించారు. ప్రతిష్టాత్మకమైన జాతీ య స్ధాయి క్రికెట్‌ టోర్నమెంట్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం సంతోషకరమని డీజీపీ పేర్కొన్నారు. టోర్నీ విజయవంతానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రేషన్‌ బియ్యం.. బ్రాండెడ్‌ దందా

రేషన్‌లో 6 రకాల నిత్యావసరాలు!

నేడు రాష్ట్రంలో వర్షాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 07:05 AM