అప్పుల బాధలతో టెకీ ఆత్మహత్య
ABN , Publish Date - Oct 20 , 2026 | 05:26 AM
హైదరాబాద్‌లోని చైతన్యపురి ప్రాంతానికి చెందిన సత్యనారాయణ పురం కాలనీ వాసి తమ్మిశెట్టి ప్రవీణ్ (34) ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు.
దిల్‌సుఖ్‌నగర్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని చైతన్యపురి ప్రాంతానికి చెందిన సత్యనారాయణ పురం కాలనీ వాసి తమ్మిశెట్టి ప్రవీణ్ (34) ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే అలవాటు గల ప్రవీణ్‌కు కొన్ని నెలలుగా నష్టాలొస్తుండటంతో అప్పుల పాలయ్యాడు. ఈ అప్పుల బాధ తాళలేక, కుటుంబ సభ్యులు, బంధువుల వద్ద పరువు పోతుందన్న మనో వ్యధతో ఆత్మహత్య చేసుకోవాలని తలపోశాడు. ఆదివారం రాత్రి ఓ కమర్షియల్ భవనం టెర్రస్ మీదకెళ్లి దూకి బలవన్మరణం పాలయ్యాడు.
ఆదివారం కావడంతో ఆ భవనంలో జనం రద్దీలేక ప్రవీణ్ మృతదేహాన్ని ఆలస్యంగా చూసిన స్థానికులిచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న చైతన్యపురి పోలీసులు.. అప్పుల బాధతోపాటు పరువు పోతుందన్న భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడు సూసైడ్ నోట్ రాసినట్లు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
మద్యం విక్రయాల జోరు.. దసరా నేపథ్యంలో ఫుల్ జోష్
డిజిటల్ వేదికపై తాండూరు కందిపప్పు రైతులు
Read Latest AP News And Telangana News And International