Share News

సికింద్రాబాద్‌ అల్ఫా హోటల్‌ సహా.. హైదరాబాద్‌లో పలు రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు

ABN , Publish Date - Nov 19 , 2026 | 04:50 AM

క్యూర్‌ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లలో టీజీ సేఫ్‌ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.

సికింద్రాబాద్‌ అల్ఫా హోటల్‌ సహా.. హైదరాబాద్‌లో పలు రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
Secunderabad Alpha Hotel

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): క్యూర్‌ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లలో టీజీ సేఫ్‌ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేసి ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్న హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్ల ఎఫ్‌ఎస్ఎస్ఏఐ లైసెన్స్‌లను టీజీసేఫ్‌ అధికారులు బుధవారం రద్దు చేశారు. సికింద్రాబాద్‌ అల్ఫాహోటల్‌, వెంగళ్‌రావునగర్‌లోని పందెంకోడి రెస్టారెంట్‌, గౌలిదొడ్డిలోని స్పైస్‌ కిచెన్‌, జూబ్లీహిల్స్‌లోని లాహమ్‌హౌస్‌ రెస్టారెంట్లు ఈ జాబితాలో ఉన్నాయి. సికింద్రాబాద్‌ అల్ఫాహోటల్‌లో పెచ్చులూడిన గోడలు, అపరిశుభ్ర వాతావరణంలో వంటలు, నిండిపోయిన డ్రైనేజీ, పావురాల విసర్జితాలు, వండిన ఆహారం నిల్వ, దుర్వాసన వస్తున్న మరుగుదొడ్లను అధికారులు గుర్తించారు.


వెంగళ్‌రావునగర్‌లోని పందెంకోడి రెస్టారెంట్‌లో తుప్పుపట్టిన కత్తులు, వంటగదిలో బొద్దింకలు. పాకుడుపట్టిన వంటగదిలో ఆహారపదార్ధాలు వండుతుండడాన్ని గుర్తించారు. జూబ్లీహిల్స్‌లోని లాహమ్‌హౌస్‌ వంటగదిలో తొలగించని వ్యర్ధాలు, పగిలిన ఫ్లోరింగ్‌, డ్రైనేజీలో ఆహరవ్యర్థాలను కనుగొన్నారు. గౌలిదొడ్డిలోని స్పైస్‌ కిచెన్‌లో వండిన మాంసంతోపాటు పచ్చిమాంసం నిల్వ చేయడం, వంటగదిలో బొద్దింకలు, సరిగా శుభ్రపరచని వంటపాత్రలను చూసి చర్యలు తీసుకున్నారు. కూకట్‌పల్లిలోని న్యూ బ్లూస్టార్‌ రెస్టారెంట్‌, పంజాగుట్టలోని శ్రీనివాసా బాయ్స్‌ హాస్టల్‌ ఎఫ్‌ఎ్‌సఏఐ అనుమతులు కూడా రద్దు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా 300 కిలోల ఆహారపదార్ధాలను పారబోశారు. సికింద్రాబాద్‌ ఎస్‌పీ రోడ్‌లోని తత్వ రెస్టారెంట్‌కు ఇంప్రూవ్‌మెంట్‌ నోటీసులు, నిజాంపేటలోని కేపీఎన్‌ ఫ్రెష్‌, బంజారాహిల్స్‌లోని లాజ్వత్‌ హైదరాబాద్‌వాలా రెస్టారెంట్‌, శేరిలింగంపల్లిలోని ప్రిన్స్‌ అరేబియన్‌ రెస్టారెంట్‌లకు టీజీసేఫ్‌ అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

‘గులాబీ’లో గలాట.. ఓరుగల్లు బీఆర్‌ఎస్‌ నేతల్లో ఆధిపత్య పోరు

అండాల దందాలో డాక్టర్ పద్మజాది కీలక పాత్ర..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 04:52 AM