హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 11 గంటల నుంచి పవర్ కట్
ABN , Publish Date - Aug 06 , 2026 | 07:10 AM
ఆజామాబాద్, హైదరాబాద్ సిటీ-1 డివిజన్ల పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం గురువారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి. వినోద్‌కుమార్ తెలిపారు.
చిక్కడపల్లి(హైదరాబాద్): ఆజామాబాద్, హైదరాబాద్ సిటీ-1 డివిజన్ల పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం గురువారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి. వినోద్‌కుమార్ తెలిపారు. ప్లేగ్రౌండ్ 11కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలో ఉదయం 11 నుంచి 12 గంటల వరకు, బాపూనగర్ పరిధిలో 11.30 నుంచి 12 గంటల వరకు, లిటిల్ ఫ్లవర్, పోస్టాఫీస్ పరిధిలో 11నుంచి ఒంటి గంట వరకు, ఎల్‌బీ స్టేడియం పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఫీవర్ ఆస్పత్రి పరిధిలో మధ్యాహ్నం 3 నుంచి 4 గంటలవరకు, ఏవీ కాలేజ్ పరిధిలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, బర్కత్‌పుర బస్‌డిపో పరిధిలో సాయం త్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామన్నారు.
బోడుప్పల్‌లో..
ఉప్పల్: వేసవి యాక్షన్ ప్లాన్ పనుల నేపథ్యంలో గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బోడుప్పల్ 33/ 11 కేవీ సబ్ స్టేషన్‌కు చెందిన 11 కేవీ బృందావన్ కాలనీ ఫీడర్ పరిధిలో గంటపాటు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ ఎన్.వేణుగోపాల్ తెలిపారు. ఈ కారణంగా రాఘవేంద్ర కాలనీ, సాయిమారుతీ నగర్, ఉదా లక్ష్మీనగర్, కేశవనగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, దీనికి వినియోగదారులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు..
Read Latest AP News And Telangana News And International News And Telugu News