పసిఫికా హిల్క్రెస్ట్లో అగ్ని ప్రమాదం!
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:00 AM
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని నానక్‌రాంగూడ, కోకాపేట సమీపంలోని పసిఫికా హిల్‌క్రెస్ట్ టవర్స్‌లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది.
12వ అంతస్తులో చెలరేగిన మంటలు
18వ అంతస్తుదాకా వ్యాప్తి
షాట్ సర్యూట్తోనే.. తప్పిన ప్రాణ నష్టం
నార్సింగి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని నానక్‌రాంగూడ, కోకాపేట సమీపంలోని పసిఫికా హిల్‌క్రెస్ట్ టవర్స్‌లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. టవర్లోని ఫేజ్-2 పరిధిలోని 12వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ అగ్నికీలలు అపార్ట్మెంట్ బయటివైపు నుంచి 18వ అంతస్తు దాకా వ్యాపించాయి. మంటలవ్యాప్తి, దట్టమైన పొగకు అపార్ట్‌మెంట్‌వాసులు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అపార్ట్మెంట్లో తక్కువ జనం ఉండటంతోనే ప్రమాదం తప్పింది. కొన్ని ఫ్లాట్లలోనే కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.
మరికొన్నింటిని ఇంకా యజమానులకు అప్పగించాల్సి ఉంది. ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. భవనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై అంతస్తుల వరకు నీటిని సరఫరా చేసే ప్రత్యేక ఫైర్ పైప్‌లైన్ వ్యవస్థ అందుబాటులో ఉండటంతో అగ్నిమాపక వాహనం నుంచి ఆ పైప్‌లైన్‌కు నీటిని పంపించారు. భవన సిబ్బంది, డిజాస్టర్ అండ్ ఫైర్ సర్వీసెస్ సిబ్బంది సంయుక్తంగా ఈ వ్యవస్థను వినియోగించి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో విద్యుత్ కేబుళ్లు, ప్లాస్టిక్ పైపులు, తీగలపై ఆరబెట్టిన దుస్తులు కాలిపోయాయి. మంటల తీవ్రతకు భవనం వెలుపల కొంత భాగం దెబ్బతిన్నట్లు సమాచారం. విద్యుత్తు షాట్ సర్క్యూట్‌తో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఓ ఫ్లాట్‌లోని గీజర్ కారణంగా మంటలు చెలరేగాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్డీఎమ్ఏ స్వాధీనం
‘క్రమశిక్షణ ముందు అందరూ సమానమే’.. రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ రియాక్షన్
Read latest Telangana News And Telugu NEws