Share News

హైదరాబాద్‌లో మినీ వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం!

ABN , Publish Date - Nov 12 , 2026 | 05:21 AM

ప్రపంచ ఆర్థిక, వ్యాపార రంగ ప్రముఖులు, విధాన నిర్ణేతలు ఒకే వేదికపై చర్చించుకునేలా దావోస్‌లో ప్రతి ఏటా జనవరిలో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సు జరుగుతుంది.

హైదరాబాద్‌లో మినీ వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం!
Hyderabad Mini World Economic Forum

హైదరాబాద్‌, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆర్థిక, వ్యాపార రంగ ప్రముఖులు, విధాన నిర్ణేతలు ఒకే వేదికపై చర్చించుకునేలా దావోస్‌లో ప్రతి ఏటా జనవరిలో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సు జరుగుతుంది. దావోస్‌ సదస్సు తరహాలోనే హైదరాబాద్‌లోనూ అంతర్జాతీయ స్థాయి వేదికను ఏర్పాటు చేయాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ప్రతి ఏడాది జూన్‌ లేదా జూలైలో హైదరాబాద్‌ కేంద్రంగా ‘మినీ వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం’ నిర్వహించాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ముందుకు తెచ్చారు.


ఈ అంశాన్ని కూడా భారత్‌ సమ్మిట్‌లో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ఆర్థిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య చర్చలకు హైదరాబాద్‌ శాశ్వత వేదికగా మారే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ఆంధ్రకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు

ప్రజాస్వామ్య పరిరక్షణకే భారత్‌ సమ్మిట్‌ 2.0

వరి పంట తప్ప..!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 05:21 AM