Share News

8,500 నెలవారీ పాస్‌ 4,000కే

ABN , Publish Date - Nov 07 , 2026 | 04:48 AM

ప్రజారవాణా సేవలను ప్రజలకు మరింత చేరువ చెయ్యాలనే లక్ష్యంతో అందుబాటులోకి తెచ్చిన మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది.

8,500 నెలవారీ పాస్‌ 4,000కే
Hyderabad Metro RTC Combo Pass

  • మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు

  • రూ.400 రోజువారీ పాస్‌ ఇకపై రూ.275కే

  • దీపావళి నుంచే అమలులోకి కొత్త ధరలు

  • రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటన

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రజారవాణా సేవలను ప్రజలకు మరింత చేరువ చెయ్యాలనే లక్ష్యంతో అందుబాటులోకి తెచ్చిన మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. ప్రస్తుతం రూ.400గా ఉన్న రోజువారి ఉమ్మడి ప్రయాణ పాస్‌ ధరను రూ.275 చేసింది. ఇందులో రూ.200 మెట్రో ప్రయాణానికి, రూ.75 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించారు. ఈ పాస్‌ తీసుకున్నవారికి ఒక రోజులో మెట్రో రైలులో నాలుగు సింగిల్‌ జర్నీలకు అనుమతి ఉంటుంది. ఆర్టీసీ బస్సు ప్రయాణాల్లో మాత్రం పరిమితి లేదు. ఇక, ప్రస్తుతం రూ.8500గా ఉన్న నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్‌ ధరను ఏకంగా రూ.4000కు తగ్గించారు.


ఇందులో రూ.3000 మెట్రో ప్రయాణానికి, రూ.1000 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించారు. ఈ పాస్‌తో మెట్రోలో నెలలో గరిష్ఠంగా 50 సింగిల్‌ జర్నీలకు అనుమతి ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి ఎలాంటి పరిమితులు ఉండవు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ప్రజలకు దీపావళి కానుకగా ప్రభుత్వం ఉమ్మడి పాస్‌ల ధరలను తగ్గించిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్‌ వినియోగదారులకు 4500 ఆదా అవుతుందని, రోజువారీ ఉమ్మడి పాస్‌ వినియోగదారులకు రూ.125 ఆదా అవుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన తగ్గింపు ధరలు దీపావళి (ఆదివారం) నుంచే అమల్లోకి వస్తాయని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై అసెంబ్లీ!

మరో రెండు పథకాలు

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 04:48 AM