Share News

ఇక మిగిలింది 15 రోజులే!

ABN , Publish Date - Mar 16 , 2026 | 08:30 AM

రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రో రైల్‌ను స్వాధీనం చేసుకోవడానికి గడువు దగ్గరపడుతోంది. సర్కారు విధించిన గడువు మరో 15 రోజులే ఉండడంతో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అధికారులు చకచకా పనులు చేస్తున్నారు.

ఇక మిగిలింది 15 రోజులే!

  • 31 కల్లా సర్కారు చేతికి ‘మెట్రో రైల్‌’

  • చకచకా పనులు పూర్తి చేస్తున్న మెట్రో అధికారులు

  • ఎల్‌అండ్‌టీ బకాయిలపై కొనసాగుతున్న మదింపు

హైదరాబాద్‌ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రో రైల్‌ను స్వాధీనం చేసుకోవడానికి గడువు దగ్గరపడుతోంది. సర్కారు విధించిన గడువు మరో 15 రోజులే ఉండడంతో హైదరాబాద్‌ మెట్రో రైల్‌(Hyderabad Metro Rail) అధికారులు చకచకా పనులు చేస్తున్నారు. నిర్దేశిత గడువులోగా ఎల్‌అండ్‌టీ నుంచి యాజమాన్య బదిలీకి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహణను చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి దశ ప్రాజెక్టులో భాగంగా ఎల్‌బీనగర్‌-మియాపూర్‌, జేబీఎస్-ఎంజీబీఎస్‌, నాగోల్‌-రాయదుర్గం కారిడార్లలో ఎల్‌అండ్‌టీ సంస్థ 69.2 కిలోమీటర్ల మేరకు పనులు చేపట్టిన విషయం తెలిసిందే.


ఈ మేరకు అప్పటి ప్రభుత్వం రవాణా ఆధారిత అభివృద్ధి (టీవోడీ) కింద హైదరాబాద్‌లో 269 ఎకరాల భూములను కేటాయించింది. మెట్రో స్టేషన్లు, డిపోల నిర్మాణానికి పోగా మిగిలిన భూముల్లో మాల్స్‌, వాణిజ్య భవనాలను నిర్మించారు. ఐడీబీఐ ఆధ్వర్యంలో వాటి మదింపు ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు సమాచారం. ఈ నెల 31లోగా మెట్రో ప్రాజెక్టును ప్రభుత్వానికి అప్పగించేందుకు ఎల్‌అండ్‌టీ ఎదురుచూస్తోంది.


city4.2.jpgప్రాజెక్టు నిర్మాణానికి వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.13 వేల కోట్ల రుణాలను సర్కారుకు బదిలీ చేయడంతోపాటు తన ఈక్విటీ వాటా రూ.2 వేల కోట్లను తీసుకుని తప్పుకోవాలని భావిస్తోంది. ఏప్రిల్‌ 1లోగా ఈ ప్రక్రియ పూర్తయితే బ్యాంకు రుణాలపై వడ్డీ భారం, అసలు తొలగిపోతుందని యోచిస్తోంది. మదింపు ప్రక్రియలో భాగంగా ఐడీబీఐ అధికారులు అన్ని అంశాలనూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎల్‌అండ్‌టీకి కేవలం బ్యాంకుల రుణాలే ఉన్నాయా..? లేక ఇతర ప్రభుత్వ రంగసంస్థలకు కూడా ఏమైనా చెల్లించాల్సి ఉందా..? అనే విషయాలను తెలుసుకుంటున్నారు.


ఐఆర్‌ఎఫ్‏సీకి ఆస్తుల తనఖా..!

ఎల్‌అండ్‌టీ బ్యాంకు రుణాలు, ఈక్విటీ వాటాను ప్రభుత్వం ఇచ్చేందుకు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ మొత్తాన్ని ఎల్‌అండ్‌టీకి ఇచ్చిన భూములు, ఆస్తులను ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఎ్‌ఫఆర్‌సీ)కి తనఖా పెట్టి, రుణాలు సేకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఐఎఫ్ఆర్‌సీతో ఇప్పటికే ప్రభుత్వం సంప్రదింపులు జరుగుతున్నాయని, మూడు కారిడార్లలో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నందున రుణాలు సులువుగా వస్తాయని ఓ అధికారి చెప్పారు. హైదరాబాద్‌ మెట్రో రైలు ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.22 వేల కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి:

రోహిత్‌రెడ్డి జైలుకు

నేనే తప్పూ చేయలేదు!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 16 , 2026 | 08:30 AM