నేనే తప్పూ చేయలేదు!
ABN , Publish Date - Mar 16 , 2026 | 05:49 AM
మొయినాబాద్ డిన్నర్ పార్టీ ఘటనలో తనపై వచ్చిన కథనాలను ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్ ఖండించారు.
స్నేహితుడు పిలిస్తే మెయినాబాద్ వెళ్లా..ఎంపీ పుట్టా మహేశ్ ప్రకటన
ఏలూరు, మార్చి 15(ఆంధ్రజ్యోతి): మొయినాబాద్ డిన్నర్ పార్టీ ఘటనలో తనపై వచ్చిన కథనాలను ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్ ఖండించారు. ఆదివారం పోలీసు విచారణ ముగించుకుని హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్న ఆయన.. మీడియాకు వీడియో ప్రకటన విడుదల చేశారు. ‘నాకు ఎలాంటి దురలవాట్లూ లేవు. నేనే తప్పూ చేయలేదు. ఒక స్నేహితుడు పిలిస్తే కలవడానికి మొయినాబాద్ వెళ్లాను. అతడిని కలిసి వచ్చే సమయంలో జరిగిన కొన్ని ఘటనలపై మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. వాటినెవరూ నమ్మొద్దు’ అని కోరారు. పోలీసు విచారణకు సహకరిస్తానన్నారు. నిజం గెలుస్తుందని.. ఆందోళన చెందవద్దని అభిమానులను కోరారు. తానెలాంటి వ్యక్తినో ఏలూరు ప్రజలకు, టీడీపీ నేతలు, కార్యకర్తలకు తెలుసని.. త్వరలో పూర్తి వివరాలతో ప్రజల ముందుకొస్తానని తెలిపారు.