Share News

కత్తితో అత్తింటివారిపై అల్లుడి దాడి!

ABN , Publish Date - Nov 05 , 2026 | 05:56 AM

ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి కత్తితో అత్త, బావమరిది, బావమరిది భార్యపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అత్త, బావమరిది భార్య మృతిచెందారు. బావమరిదికి గాయాలయ్యాయి.

కత్తితో అత్తింటివారిపై అల్లుడి దాడి!
Meerpet murder

  • తీవ్రగాయాలతో అత్త, బావమరిది భార్య మృతి..

  • బావమరిదికి గాయాలు..

  • కొన్నాళ్లుగా భార్యకు వేధింపులు

  • పుట్టింటికొచ్చేసి భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

  • పలుమార్లు అత్యాచారం చేశాడంటూ బావమరిది భార్యా ఫిర్యాదు

  • ఇంట్లోకొచ్చి ముగ్గురిపై దాడి..

  • మీర్‌పేట్‌లో ఘటన

సరూర్‌నగర్‌, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి కత్తితో అత్త, బావమరిది, బావమరిది భార్యపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అత్త, బావమరిది భార్య మృతిచెందారు. బావమరిదికి గాయాలయ్యాయి. హైదరా బాద్‌ శివారు మీర్‌పేట్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. మీర్‌పేట్‌లో నివసిస్తున్న నిరంజన్‌బీ (60) తన కుమార్తె నూర్‌బేగంను క్యాబ్‌ డ్రైవర్‌ అయిన షేక్‌ సిద్ధిఖీకి ఇచ్చి పెళ్లి చేసింది. నిరంజన్‌బీ కుమారుడు, అతడి భార్య (40) ఆమెతోనే ఉంటున్నారు. కాగా నూర్‌బేగంకు భర్త షేక్‌ సిద్ధిఖీతో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. అతడి వేధింపులను తాళలేక ఆమె పుట్టింటికొచ్చేసింది. భర్త షేక్‌ సిద్ధిఖీ తనను శారీరకంగా హింసిస్తున్నాడని ఆరోపిస్తూ బుధవారం నూర్‌బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నూర్‌బేగంతో పాటు నిరంజన్‌బీ కోడలు కూడా షేక్‌ సిద్ధిఖీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తీవ్ర బెదిరింపులకు గురిచేసి సిద్ధిఖీ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, అతడి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో ఆమె పేర్కొంది.


కాగా భార్య, బావమరిది భార్య తనపై ఫిర్యాదు చేయడంతో సిద్ధిఖీ ఉన్మాదిగా మారాడు. సాయంత్రం నాలుగింటికి మీర్‌పేట పెట్రోలు బంక్‌కు వెళ్లాడు. అక్కడ పనిచేస్తున్న బావమరిదిని ‘‘మీ ఇంటికి వెళ్లి మాట్లాడుకుం దాం’’ అంటూ వెంట తీసుకెళ్లాడు. ఇంట్లోకి వచ్చీరాగానే ‘‘నాపైనే ఫిర్యాదు చేస్తారా?’’ అంటూ బూతులు తిడుతూ వెంట తెచ్చుకున్న కత్తితో అత్త నిరంజన్‌బీ, బావమరిది భార్యతో పాటు బావమరిదిపైనా విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో షేక్‌ సిద్ధికీ అత్త నిరంజన్‌బీ, బావమరిది భార్య అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన బావమరిదిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులొచ్చి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న సిద్ధిఖీ కోసం వెతుకుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సదర్‌ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక

సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్

బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 05:56 AM