Share News

కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్ కేసులో మరో ముగ్గురి అరెస్ట్!

ABN , Publish Date - Aug 24 , 2026 | 08:55 AM

తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో తాజాగా మరో ముగ్గురు నిందితులను ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్ కేసులో మరో ముగ్గురి అరెస్ట్!
Konda Surekha

హైదరాబాద్, ఆగస్టు 24: రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్ వివాదాస్పద వ్యవహారానికి సంబంధించిన కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో తాజాగా మరో ముగ్గురు నిందితులను ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లోని మార్టూరులో అదుపులోకి తీసుకున్నారు.


పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో అరుణ్ కుమార్, మత్యాల మహేందర్ రెడ్డి, కార్తీక్ ఉన్నట్లు గుర్తించారు. మార్టూరులో ఉన్న ఈ ముగ్గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా ప్రణాళికతో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సుమంత్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. పరారీలో ఉన్న వారిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.


తాజా అరెస్టులతో ఈ హైప్రొఫైల్ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఉదంతానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర నిందితుల ఆచూకీ కోసం పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. త్వరలోనే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.


ఇవీ చదవండి:

నిబద్ధత, పట్టుదలతోనే విజయం

టెక్‌ వ్యూ 24,600 వద్ద గట్టి పరీక్ష!

Updated Date - Aug 24 , 2026 | 09:09 AM