గినియాలో కుప్పకూలిన డంపింగ్ యార్డ్.. 30 మంది దుర్మరణం
ABN , Publish Date - Aug 24 , 2026 | 08:20 AM
పశ్చిమ ఆఫ్రికాలోని గినియాలో ఓ డంపింగ్ యార్డ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 30 మంది దుర్మరణం పాలయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ ఆఫ్రికాలోని గినియాలో ఓ డంపింగ్ యార్డ్ కూలడంతో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా సహాయక బృందాలు వారిని ఆస్పత్రికి తరలించాయి. గినియా రాజధాని కొనక్రిలో ఈ ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా డంపింగ్ యార్డ్ కుప్పకూలినట్టు తెలుస్తోంది.
మృతిచెందిన 30 మందిలో ఇప్పటివరకు 18 మృతదేహాలను వెలికితీసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారనే అనుమానంతో రక్షణ బృందాలను రంగంలోకి దించినట్టు గినియా ప్రభుత్వం తెలిపింది. అయితే.. అక్కడ ప్రమాదం జరిగే అవకాశమున్నట్టు తాము ముందే ఊహించామని, స్థానికులను వేరే ప్రాంతానికి వెళ్లాలని ఇటీవలే ఆదేశించామని చెప్పింది.
ఇవీ చదవండి:
మహారాష్ట్ర థానేలో వైద్యుడిపై దాడి.. బూతులు తిడుతూ..
ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు నవజాత శిశువుల సజీవ దహనం