నాగ్‌పూర్‌లో నీటి ప్లాంట్ వద్ద క్లోరిన్ గ్యాస్ లీక్.. 40 మందికి అస్వస్థత..
ABN , Publish Date - Aug 24 , 2026 | 08:36 AM
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో క్లోరిన్ వాయువు లీక్ కావడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. గోధ్ని ప్రాంతంలోని కలెక్టర్ కాలనీ సమీపంలో ఉన్న నీటి శుద్ధి కేంద్రం వద్ద ట్యాంకర్ నుంచి క్లోరిన్ వాయువు పెద్ద మొత్తంలో లీకైనట్లు అధికారులు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో క్లోరిన్ వాయువు లీక్ కావడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. గోధ్ని ప్రాంతంలోని కలెక్టర్ కాలనీ సమీపంలో ఉన్న నీటి శుద్ధి కేంద్రం వద్ద ట్యాంకర్ నుంచి క్లోరిన్ వాయువు పెద్ద మొత్తంలో లీకైనట్లు అధికారులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. లీకేజీ కారణంగా పరిసర ప్రాంతాల్లోని పలు కుటుంబాలు ప్రభావితమయ్యాయి (Nagpur chlorine gas leak).
క్లోరిన్ వాయువు లీకైన తర్వాత పరిసర ప్రాంతాల్లోని పలువురు ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారిలో కొందరిని చికిత్స కోసం సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. మంకాపూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందని పోలీసులు తెలిపారు (Nagpur water plant gas leak).
ప్రభావిత ప్రాంతంలో వీధి కుక్కలు మృతి చెందినట్లు కూడా స్థానిక మీడియా వెల్లడించింది (Godhni chlorine leak). అయితే వాటి మరణానికి క్లోరిన్ లీకేజీనే కారణమని ఇప్పటివరకు నిర్ధరాణ జరగలేదు. క్లోరిన్ వాయువు ఎందుకు లీకైంది, ట్యాంకర్‌లో ఏ లోపం ఏర్పడింది అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం వల్ల ప్రభావితమైన వారి వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
భర్తను చంపేసి పేగులను బయటకు తీసి.. హర్యానాలో ఓ మహిళ దారుణం..
స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..