భర్తను చంపేసి పేగులను బయటకు తీసి.. హర్యానాలో ఓ మహిళ దారుణం..
ABN , Publish Date - Aug 24 , 2026 | 07:50 AM
హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన ఒక దిగ్భ్రాంతికర హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ తన భర్తను చంపి, అతడి పేగులు బయటకు తీసి దారుణానికి పాల్పడింది
ఇంటర్నెట్ డెస్క్: హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన ఒక దిగ్భ్రాంతికర హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ తన భర్తను చంపి, అతడి పేగులు బయటకు తీసి దారుణానికి పాల్పడింది. ఆ తర్వాత ఇంటి యజమాని చూశాడనే భయంతో భయాందోళనకు గురై ఇంటి పైకప్పు మీది నుంచి కిందకు దూకేసింది. ప్రస్తుతం ఆమె హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది (Haryana woman kills husband).
కురుక్షేత్రలోని పెహోవా రోడ్డులో ఉన్న రాజ్ ప్యాలెస్ సమీపంలో రాజేష్, విమలా దేవి ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఇటీవల రాజేష్, విమలా దేవి ఏదో విషయమై గొడవపడ్డారు. ఆ గందరగోళాన్ని విని ఇంటి యజమాని రింకు డాబా మీదకు పరుగెత్తాడు. అక్కడ అతడు చూసిన దృశ్యం అచ్చం క్రైమ్ సినిమాలోని సన్నివేశంలా ఉంది. రాజేష్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడి శరీరం నుంచి బయటకు వచ్చిన పేగులను విమల ఒక సంచిలో పెడుతోంది (Haryana crime news).
ఇంటి యజమానిని చూడగానే ఆ మహిళ భయాందోళనకు గురైంది. వెంటనే టెర్రస్ పై నుంచి కిందకు దూకేసింది (Wife kills husband). గాయపడిన నిందితురాలిని ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పదునైన ఆయుధాలతో రాజేష్ పొట్టను సుమారు 35 సెంటీమీటర్ల మేర కోసి, లోతైన గాయాలు చేసినట్లు పోస్ట్‌మార్టంలో తెలిసింది. ఘటనా స్థలం నుంచి మూడు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇరాన్ ముందున్న మంచి మార్గం అదొక్కటే: అధ్యక్షుడు పెజెష్కియాన్
తుర్కియే మిలిటరీ విమానాల్లో డ్రోన్స్ తరలింపు?