Share News

టెక్‌ వ్యూ 24,600 వద్ద గట్టి పరీక్ష!

ABN , Publish Date - Aug 24 , 2026 | 06:05 AM

నిఫ్టీ గత వారం సానుకూలంగా ప్రారంభమై ఆ తర్వాత కరెక్షన్‌లోకి జారుకుని 24,000 స్థాయిలకు వరకు వెళ్లింది. చివరి రెండు సెషన్లలో కనిష్ఠ స్థాయిల నుంచి రికవరీ సాధించి చివరకు వీక్లీ ...

టెక్‌ వ్యూ 24,600 వద్ద గట్టి పరీక్ష!

నిఫ్టీ గత వారం సానుకూలంగా ప్రారంభమై ఆ తర్వాత కరెక్షన్‌లోకి జారుకుని 24,000 స్థాయిలకు వరకు వెళ్లింది. చివరి రెండు సెషన్లలో కనిష్ఠ స్థాయిల నుంచి రికవరీ సాధించి చివరకు వీక్లీ ప్రాతిపదికన 114 పాయింట్ల (0.47ు) నష్టంతో 24,250 స్థాయిల వద్ద క్లోజైంది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కన్ఫర్మేషన్‌ కోసం వచ్చే కొద్ది రోజులు పటిష్ఠంగా ముగియాల్సి ఉంటుంది. గరిష్ఠ స్థాయిల నుంచి 750 మేర కరెక్షన్‌ అనంతరం గత కొద్ది వారాలుగా ఈ ట్రెండ్‌కు బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. అయితే టెక్నికల్‌గా చూస్తే ఈ వారం రికవరీ కనబరిచి గరిష్ఠ నిరోధ స్థాయిలైన 24,600 వద్ద మరోసారి గట్టి పరీక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది. అప్పుడే బుల్లిష్‌ ట్రెండ్‌ను సూచిస్తుంది. మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ స్వల్ప నష్టంతో ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిలైన 63,375 వద్ద క్లోజైంది. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ కూడా అప్‌ట్రెండ్‌ను కనబరుస్తూ జీవితకాల గరిష్ఠ స్థాయిలైన 19,977 వద్ద స్థిరపడింది.

బుల్లిష్‌ స్థాయిలు: సానుకూల ట్రెండ్‌ కోసం మేజర్‌ నిరోధ స్థాయిలైన 24,400 కన్నా పైన నిలదొక్కుకోవాలి.ఇది గతవారం ఏర్పడిన గరిష్ఠ స్థాయి. ఇక్కడ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. తదుపరి స్వల్పకాలిక నిరోధ స్థాయి 24,600. ఇక్కడ నిలదొక్కుకుంటే తదుపరి నిరోధ స్థాయిలు 24,800, 25,000 వద్ద ఉంటాయి.

బేరిష్‌ స్థాయిలు: నిఫ్టీ ఏదేనీ బలహీనతను సూచిస్తే 24,200 దిగువన మద్దతు స్థాయిలు ఉంటాయి. ఈ స్థాయిల నిలదొక్కుకోలేకపోతే మరింత బలహీనతను సూచిస్తుంది. తదుపరి మైనర్‌ మద్దతు స్థాయి 24,000 దిగువన ఉంటాయి. ఒకవేళ ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే మరింత బలహీనతను సూచిస్తుంది. అప్రమత్తంగా ఉండటం మంచిది.

బ్యాంక్‌ నిఫ్టీ: గత వారం ఈ సూచీ తొలుత కరెక్షన్‌ను కనబరిచి ప్రధాన మానసిక అవధి స్థాయిలైన 57,000 వరకు వెళ్లింది. అనంతరం కనిష్ఠ స్థాయిల నుంచి రికవరీ కనబరిచింది. చివరకు 270 పాయింట్ల లాభంతో 57,760 వద్ద క్లోజైంది. ఈ వారం పాజిటివ్‌ ట్రెండ్‌ను సూచిస్తే 58,200 వద్ద నిరోధ స్థాయిలు ఉంటాయి. తదుపరి ప్రధాన నిరోధ స్థాయి 58,700. ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే 57,000 వద్ద మద్దతు స్థాయిలు ఉంటాయి.


పాటర్న్‌: నిఫ్టీ గత వారం 50 రోజుల చలన సగటు స్థాయిలైన 24,000 వద్ద రికవరీ సాధించింది. ఇది గడిచిన మూడు నెలల్లో ఏర్పడిన గరిష్ఠ బాటమ్‌ ప్యాట్రన్‌. గడిచిన ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై నెలల్లో 24,400 వద్ద ‘ఫోర్‌ టాప్స్‌’ ప్యాట్రన్‌ను ఏర్పరచుకుంది. సానుకూలత కోసం ఇక్కడ బ్రేకౌట్‌ సాధించాల్సి ఉంటుంది.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం గురువారం మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 24,400, 24,460

మద్దతు : 24,270, 24,200

వి. సుందర్‌ రాజా

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..

అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..

Updated Date - Aug 24 , 2026 | 06:05 AM