భార్యను గదిలో బంధించి.. స్నేహితులతో లైంగిక దాడి
ABN , Publish Date - Oct 27 , 2026 | 09:28 PM
నగరానికి చెందిన ఒక వ్యక్తి తన భార్యను గదిలో బంధించాడు. ఆ తరువాత ఆమెపై అత్యాచారం జరిపేందుకు తన ముగ్గురు స్నేహితులను అదే గదిలోకి పంపాడు.
ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌లో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. నగరానికి చెందిన ఒక వ్యక్తి తన భార్యను గదిలో బంధించాడు. ఆ తరువాత ఆమెపై అత్యాచారం జరిపేందుకు తన ముగ్గురు స్నేహితులను అదే గదిలోకి పంపాడు. ఆ ముగ్గురూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. గత జూన్‌లో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మయన్మార్‌కు చెందిన ఓ యువతి బంగ్లాదేశ్‌లో నివాసముంటోంది. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ ఫయాజ్ ఆమెను పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఈ ఏడాది మేలో ఆ యువతిని హైదరాబాద్ తీసుకువచ్చి వివాహమాడాడు. ఇద్దరు కలిసి ఇక్కడ ఓ అద్దె ఇంట్లో ఉండేవారు. అయితే పెళ్లి జరిగి నెల రోజులు గడిచాక.. భార్యను భర్త వేధించటం మొదలుపెట్టాడు. ఆమెను గదిలో నిర్భంధించి అతడు బయటకు వెళ్లేవాడు. ఒకరోజు మహమ్మద్ తన స్నేహితులు ముగ్గురిని భార్య ఉన్న గదిలోకి పంపించి, బయట నుంచి తాళం వేశాడు. ఆ స్నేహితులు యువతిని లైంగికంగా వేధించేవాళ్లు. ఈ వేధింపుల గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామని ఆమెను బెదిరించేవారు కూడా.
గత కొంత కాలంగా మహమ్మద్ అద్దె కట్టకపోవడంతో ఇంటి యజమాని అక్టోబర్ 23న వచ్చి చూడగా ఈ దారుణం బయటపడింది. స్థానికుల సహాయంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తలూ చదవండి
హైదరాబాద్‌లో విషాదం.. రెండేళ్ల కూతురిని చంపేసి.
హైదరాబాద్‌లో దారుణం.. సెల్‌ఫోన్ కోసం యువతిని పొడిచి..