Share News

జగన్ కంచుకోట బద్దలు.. పులివెందులలో టీడీపీ ఏకగ్రీవాలు!

ABN , Publish Date - Oct 27 , 2026 | 05:16 PM

స్థానిక ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ కంచుకోట పులివెందులను టీడీపీ బద్దలు కొట్టింది.

జగన్ కంచుకోట బద్దలు.. పులివెందులలో టీడీపీ ఏకగ్రీవాలు!

కడప జిల్లా, అక్టోబర్ 27: స్థానిక ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ కంచుకోట పులివెందులను టీడీపీ బద్దలు కొట్టింది. ఆ నియోజకవర్గ పరిధిలో 65 ఎంపీటీసీ స్థానాలు ఉంటే అందులో 64 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. అలాగే 7 జడ్పీటీసీ స్థానాల్లో మూడు తన ఖాతాలో వేసుకుంది. వేంపల్లి మండలంలో 18 ఎంపీటీసీ స్థానాల్లో 17 గెలుపొందింది. ఇప్పటికే పులివెందుల మున్సిపాలిటీలో 40 వార్డులకు 20 వార్డులను టీడీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.


చిత్తూరులో పలు స్థానాలను అధికార కూటమి ఏకగ్రీవంగా గెలుస్తోంది. ఈ జిల్లాలోని మూడు జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. యాదమర్రి జడ్పీటీసీగా యశోద, బంగారు పాలెం జడ్పీటీసీగా సుచిత్ర జయప్రకాష్, పూతలపట్టు జడ్పీటీసీగా శైలజ తేజో మూర్తి ఏకగ్రీవంగా గెలిచారు.

అలాగే నంద్యాల జిల్లాలో 8 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. బనగానపల్లె నియోజకవర్గంలోని బనగానపల్లి, కొలిమిగుండ్ల, అవుకు, సంజామల, కోవెలకుంట్ల జడ్పీటీసీ స్థానాలను కూటమి ఖాతాలో వేసుకుంది. డోన్ నియోజకవర్గంలో బేతంచెర్ల, ప్యాపిలి, శ్రీశైలం నియోజకవర్గంలోని వెలుగోడు స్థానాలనూ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.


ఈ వార్తలూ చదవండి

స్థానిక ఎన్నికలు.. సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ

జగన్.. జనజీవన స్రవంతిలోకి రావాలి:

Updated Date - Oct 27 , 2026 | 05:56 PM