ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. రాజ్ కసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట
ABN , Publish Date - Oct 27 , 2026 | 03:14 PM
ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కసిరెడ్డి అరెస్ట్ విధానం, ప్రొడక్షన్ వారెంట్‌పై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కసిరెడ్డి అరెస్ట్ విధానం, ప్రొడక్షన్ వారెంట్‌పై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. కసిరెడ్డికి ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌లో జోక్యానికి నిరాకరించింది. విచారణ పూర్తయ్యే వరకు నిందితుడు దేశం విడిచి వెళ్లకూడదని, పోలీసు దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించాలంటూ సుప్రీంకోర్టు షరతు విధించింది. ‘అరెస్టు చేయబోము’ అని కోర్టులో హామీ ఇచ్చిన తర్వాత కూడా ప్రొడక్షన్ వారెంట్ జారీ చేయడంపై సుప్రీంకోర్టులో తీవ్ర వాదనలు జరిగాయి.
హైకోర్టు తీర్పులోని కొన్ని వ్యాఖ్యలను అంగీకరించకపోయినా, నిందితుడి బెయిల్, స్వేచ్ఛను రద్దు చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పోలీసులు నేరుగా చేసే అరెస్ట్‌కు, కోర్టు జారీ చేసే ప్రొడక్షన్ వారెంట్‌కు తేడా ఉందని ధర్మాసనం తెలిపింది. ముందస్తు అనుమతి లేకుండా మళ్లీ అరెస్ట్ చేయకూడదన్న హైకోర్టు తీర్పులోని పేరా-23 నిబంధనలను న్యాయస్థానం సమర్థించింది. నిందితుడు విచారణకు సహకరించకపోతే బెయిల్ రద్దు కోసం కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఇవి కూడా చదవండి...
విశాఖలో తుఫాన్ ముప్పు.. ప్రజలకు కలెక్టర్ అత్యవసర విజ్ఞప్తి
‘ప్రాణనష్టం జరగకుండా చూడాలి’.. ఆర్నబ్ తుఫాన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు
Read Latest AP News And Telugu News