అమెరికన్లకు వలేసి.. రూ.261 కోట్లు దోచేసి..
ABN , Publish Date - Nov 05 , 2026 | 05:59 AM
అమెరికాలోని వృద్ధులను లక్ష్యంగా చేసుకొని.. ప్రభుత్వ అధికారులమంటూ ఫోన్లు చేసి బెదిరించి ఏకంగా రూ.261 కోట్లు దోచేసిన ఫేక్ కాల్ సెంటర్ ముఠా గుట్టును ఈడీ అధికారులు రట్టు చేశారు.
ప్రభుత్వ అధికారులమంటూ ఫోన్లు చేసి
కొల్లగొట్టిన ఫేక్ కాల్‌సెంటర్ ముఠా గుట్టు రట్టు
హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): అమెరికాలోని వృద్ధులను లక్ష్యంగా చేసుకొని.. ప్రభుత్వ అధికారులమంటూ ఫోన్లు చేసి బెదిరించి ఏకంగా రూ.261 కోట్లు దోచేసిన ఫేక్ కాల్ సెంటర్ ముఠా గుట్టును ఈడీ అధికారులు రట్టు చేశారు. హైదరాబాద్ మాదాపూర్‌లో ప్రారంభమైన ఈ ఫేక్ కాల్ సెంటర్ కథ పలు మలుపులు తిరిగి పంజాబ్‌కు చేరింది. ఈ కేసులో నలుగురిని పంజాబ్‌లో మంగళవారం అరెస్టు చేసిన ఈడీ హైదరాబాద్ జోన్ అధికారులు.. బుధవారం నాంపల్లిలోని ప్రీవెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టం (పీఎంఎల్‌ఏ) ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు.
వీరిలో పంజాబ్‌కు చెందిన హర్షిల్ నయన్ భాయ్ రావల్, జస్వంత్ సింగ్, చేతన్ ముంజాల్, ప్రణవ్ పితాడియాలు ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి గతంలో వికాస్‌కుమార్, తారాచంద్ నిమార్, మహ్మద్ ఇర్ఫాన్ అన్సారీలను అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఏడుకి చేరింది. ఈ ఏడాది సెప్టెంబరులోనే ఈడీ అధికారులు పాటియాలా, పుణె, చండీగఢ్‌లలో నాలుగు చోట్ల సోదాలు నిర్వహించి మూడు లైవ్ కాల్ సెంటర్లను గుర్తించారు. ఇందులో రెండు పాటియాలాలో, ఒకటి పుణెలో ఉన్నాయి. ఈడీ సోదాల సమయంలో ఆ మూడు కాల్ సెంటర్లలో 220 మంది ఉద్యోగులు పనిచేస్తూ దొరికారు. గతఏడాది జూలైనుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఈ ముఠా 27.39 మిలియన్ డాలర్లు (రూ.261 కోట్లు) దోచుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సదర్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక
సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్
బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News