Share News

సైబర్‌ కేటుగాళ్ల పంజా.. 3 ఘటనల్లో 1.57కోట్లు స్వాహా!

ABN , Publish Date - Nov 18 , 2026 | 05:58 AM

సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడలతో సామాన్యుల నుంచి కార్పొరేట్‌ సంస్థల వరకు ఎవరినీ వదలకుండా నిలువుదోపిడీ చేస్తున్నారు.

సైబర్‌ కేటుగాళ్ల పంజా.. 3 ఘటనల్లో 1.57కోట్లు స్వాహా!
Hyderabad Cyber Crime

  • నటికి రూ.4.14 లక్షలు, ఓ సంస్థకు 1.50 కోట్ల టోకరా

  • వాటర్‌ బిల్లు పేరుతో రూ. 3.54లక్షలు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడలతో సామాన్యుల నుంచి కార్పొరేట్‌ సంస్థల వరకు ఎవరినీ వదలకుండా నిలువుదోపిడీ చేస్తున్నారు. హైదరాబాద్‌లో మూడు వేర్వేరు ఘటనల్లో ఏకంగా రూ.1.57కోట్లకు పైగా కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాషింగ్టన్‌ వెళ్లేందుకు విమాన టికెట్‌ బుక్‌ చేసుకున్న మాదాపూర్‌కు చెందిన నటి గోగినేని అనితా చౌదరిని కేటుగాళ్లు మోసం చేశారు. ఈ నెల 12న ‘లో ఫ్లై ట్రావెల్స్‌’ పేరుతో సంప్రదించిన నిందితుడు రాజేశ్‌.. బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ బుకింగ్‌ పేరుతో డెబిట్‌ కార్డు వివరాలు, ఓటీపీ తీసుకుని రూ. 4.14లక్షలు కాజేశాడు. నార్సింగిలోని మిశ్రాన్‌ సెమీకండక్టర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ చైనా సంస్థ నుంచి ఎలక్ట్రానిక్‌ విడిభాగాల పరికరాల కోసం జరిపిన లావాదేవీల్లో రూ.1.50 కోట్లకు పైగా మోసపోయింది.


నేరగాళ్లు అసలు కంపెనీ ఈమెయిల్‌ డొమైన్‌లో ఒక చిన్న అక్షరాన్ని మార్చి నకిలీ ఈమెయిల్‌ సృష్టించి సంస్థ ప్రతినిధులుగా చలామణి అయ్యారు. కొత్త పర్చేజ్‌ ఇన్వాయిస్‌ పంపి, అందులో వేరే బ్యాంకు ఖాతా వివరాలను పొందుపరిచారు. దీనిని గుర్తించని ప్రతినిధులు సదరు ఖాతాకు రూ.1.40 కోట్లు బదిలీ చేశారు. కాగా, వాటర్‌బిల్లు బకాయి ఉందంటూ గాజుల రామారానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగిని సైబర్‌ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. హెచ్‌ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ పేరుతో వాట్సాప్‌ సందేశం పంపి తొలుత అధికారిక వెబ్‌సైట్‌లో రూ.1,565 బిల్లు చెల్లించేలా చేశారు. అనంతరం మరో నంబర్‌ నుంచి ఫోన్‌ చేసి రూ.13 బకాయి ఉందని, లింక్‌ ద్వారా చెల్లించాలని ఏపీకే ఫైల్‌ పంపి ఇన్‌స్టాల్‌ చేయించారు. ఆ లింక్‌లో బాధితుడు తన కార్డు వివరాలు నమోదు చేయగానే వరుస ఓటీపీలతో రూ 4.36లక్షలు డ్రా చేశారు.


ఇవి కూడా చదవండి...

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. వంతెన పైనుంచి లోయలోకి దూసుకెళ్లి..

ముద్దంటూ విదేశీయురాలిని వేధించిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..

Read Latest National News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 05:58 AM