Share News

30న ఆటోల బంద్‌: ఆటో డ్రైవర్ల జేఏసీ

ABN , Publish Date - Nov 16 , 2026 | 06:29 AM

పెంచిన ఆటో మీటర్‌ చార్జీలను 15 రోజుల్లో అమలు చేయకుంటే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో... ఈ నెల 30న ఒక రోజు బంద్‌ నిర్వహిస్తున్నట్టు మహాత్మగాంధీ తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ జేఏసీ పేర్కొంది.

30న ఆటోల బంద్‌: ఆటో డ్రైవర్ల జేఏసీ
Hyderabad Auto Strike

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):పెంచిన ఆటో మీటర్‌ చార్జీలను 15 రోజుల్లో అమలు చేయకుంటే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో... ఈ నెల 30న ఒక రోజు బంద్‌ నిర్వహిస్తున్నట్టు మహాత్మగాంధీ తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ జేఏసీ పేర్కొంది. ఆదివారం హైదర్‌గూడ ఎన్‌ఎస్ఎస్‌లో విలేకరుల సమావేశంలో జేఏసీ కన్వీనర్‌ మహ్మద్‌ అమానుల్లాఖాన్‌ మాట్లాడారు. గ్రీన్‌ క్యాబ్‌లను ప్రభుత్వం అనుమతించడం.. ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల జీవితాలతో చెలగాటమాడడమే అన్నారు.


గ్రీన్‌ క్యాబ్‌లను వెంటనే నిషేధించాలని, ఆటో బ్లాక్‌ మార్కెట్‌ దందా అరికట్ట్టాలని, ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చిన మేరకు ఏటా రూ.12 వేల చొప్పున రూ.36 వేలు ప్రభుత్వం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. బెంగళూరు తరహాలో నగరంలో ద్విచక్ర వాహనాల ట్యాక్సీలు నిషేధించాలన్నారు. గూండాల దాడిలో మృతి చెందిన ఆటో డ్రైవర్‌ మహ్మద్‌ ముకరం కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.



ఈ వార్తలు కూడా చదవండి..

ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్‌ వార్తలు

తెలంగాణకు భారీ వర్ష సూచన

సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 06:29 AM