శంషాబాద్ విమానాశ్రయంలో రూ.2.71 కోట్ల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:13 AM
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ స్థాయిలో హైడ్రోఫోనిక్ గంజాయిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
గీజర్‌లో దాచి తెచ్చిన ప్రయాణికుడు
హైదరాబాద్, శంషాబాద్ రూరల్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ స్థాయిలో హైడ్రోఫోనిక్ గంజాయిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఒక ప్రయాణికుడి లగేజీలో ఉన్న ఎలక్ట్రికల్ గీజర్‌లో దాచిన 7.75 కిలోల గంజాయి ప్యాకెట్లను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు.
ఈ గంజాయి విలువ రూ.2.71 కోట్లు ఉంటుందని డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఆ ప్రయాణికుడి వద్ద ఉన్న గీజర్ బరువు సాధారణం కంటే ఎక్కువగా ఉండటంతో డీఆర్ఐ అధికారులు అనుమానించి అతడ్ని సోదా చేయడంతో హైగ్రేడ్ గంజాయి రవాణా వ్యవహారం బయటపడింది. గత కొన్ని నెలలుగా బ్యాంకాక్, దోహ రూట్లో హైడ్రో ఫోనిక్ గంజాయి స్మగ్లింగ్ ఎక్కువ అయ్యిందని, ఇప్పటికే పలువురు డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేశామని డీఆర్ఐ అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఏసీబీ కస్టడీకి నిమ్స్ లక్ష్మీ భాస్కర్
భద్రతా ఫీచర్ల పేపర్‌తో కొత్త ‘మీ-సేవ’ సర్టిఫికెట్
హైదరాబాద్‌లో కొత్తగా 70వేల మంది ఓటర్లు!
Read Latest AP News And Telangana News And International