Share News

బాణసంచా దుకాణం అనుమతులకు లంచం

ABN , Publish Date - Nov 07 , 2026 | 06:29 AM

బాణసంచా దుకాణాల ఏర్పాటుకు అనుమతుల కోసం వచ్చిన వారి నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు ఎల్బీనగర్‌ అగ్నిమాపక కేంద్రంపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు.

బాణసంచా దుకాణం అనుమతులకు లంచం
ACB

  • ఎల్బీనగర్‌ అగ్నిమాపక కేంద్రంపై ఏసీబీ దాడులు

  • 30 వేల నగదు, 80 ఆన్‌లైన్‌ లావాదేవీలగుర్తింపు

మన్సూరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): బాణసంచా దుకాణాల ఏర్పాటుకు అనుమతుల కోసం వచ్చిన వారి నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు ఎల్బీనగర్‌ అగ్నిమాపక కేంద్రంపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఉప్పల్‌ భగాయత్‌లోని ఈ అగ్నిమాపక కేంద్రంలో నిర్వహించిన సోదాల్లో ఇన్‌చార్జి సీఐ శీనయ్యతో పాటు స్టేషన్‌ ఇన్‌చార్జి పి.శ్రీధర్‌, మరికొందరు సిబ్బంది వద్ద రూ.30 వేల అనధికార నగదు, 80 ఆన్‌లైన్‌ లావాదేవీలను గుర్తించామని రంగారెడ్డి జిల్లా రేంజ్‌ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ తెలిపారు.


అదేవిధంగా వారు ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎంల ద్వారా నిర్వాహకుల నుంచి వారి దుకాణాల స్థాయిని బట్టి రూ.500 నుంచి రూ.5 వేల వరకు పొందినట్లు వారి ఫోన్లను పరిశీలిస్తే తెలిసిందన్నారు. పూర్తి విచారణ అనంతరం ఉన్నతాధికారుల అనుమతితో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 06:29 AM