Share News

వివాహమైన కుమార్తె కూడా కారుణ్య నియామకానికి అర్హురాలే: హైకోర్టు

ABN , Publish Date - Oct 29 , 2026 | 06:33 AM

వివాహమైన కుమార్తె కూడా కారుణ్య నియామకానికి అర్హురాలేనని హైకోర్టు స్పష్టం చేసింది.

వివాహమైన కుమార్తె కూడా కారుణ్య నియామకానికి అర్హురాలే: హైకోర్టు
Telangana High Court

వివాహమైన కుమార్తె కూడా కారుణ్య నియామకానికి అర్హురాలేనని హైకోర్టు స్పష్టం చేసింది. తనకు వివాహమైందనే కారణంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వకపోవడం చెల్లదని, విద్యుత్‌ పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్‌ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ కుంభం జ్యోతి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ వేణుగోపాల్‌ ధర్మాసనం.. వివాహమైన కుమార్తెలు కూడా కారుణ్య నియామకాలకు అర్హులేనని, పిటిషనర్‌కు అన్ని ప్రయోజనాలతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి:

అప్రాధాన్య పోస్టుకు జయేశ్‌ రంజన్‌

దీపావళి తర్వాత భారీ ప్రక్షాళన

ఆ జూనియర్‌ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 06:33 AM