Share News

హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం

ABN , Publish Date - Apr 19 , 2026 | 06:09 PM

హైదరాబాద్‌‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడుతోంది. నిజాంపేట్‌, కేపీహెచ్బీ, బోయిన్‌పల్లి, జీడిమెట్ల, బాలానగర్‌, జగద్గిరిగుట్ట, షాపూర్‌నగర్‌లో భారీ వర్షం కురుస్తోంది.

హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం
Heavy Rains in Hyderabad

హైదరాబాద్‌: నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడుతోంది. నిజాంపేట్‌, కేపీహెచ్బీ, బోయిన్‌పల్లి, జీడిమెట్ల, బాలానగర్‌, జగద్గిరిగుట్ట, షాపూర్‌నగర్‌లో భారీ వర్షం కురుస్తోంది. అలాగే సూరారం, దుండిగల్‌, గండిమైసమ్మ, సికింద్రాబాద్‌, తిరుమలగిరి, అల్వాల్‌, ప్యాట్నీ, ప్యారడైజ్‌, మారేడ్‌పల్లిలోనూ ఈదురుగాలులతో కూడిన వాన దంచికొడుతోంది.


చింతల్‌లో ఈదురుగాలులకు ఓ భారీ వృక్షం నేలకొరగగా.. రెండు విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు, వృక్షాలు పడిపోవడంతో పలు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. కూకట్‌పల్లి, మూసాపేట్‌, జేఎన్టీయూ ప్రాంతాల్లో వడగళ్ల వాన పడుతోంది. నిజాంపేట్‌, కేపీహెచ్బీ, బోయిన్‌పల్లి, జీడిమెట్లలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ వర్షాలకు పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

మహిళా రిజర్వేషన్ బిల్లు.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు..

పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి తప్పిన ముప్పు.. కుల్కచర్లలో డ్రోన్ ప్రదర్శనలో అపశృతి!

Updated Date - Apr 19 , 2026 | 06:20 PM