Share News

శారదా పీఠం భూములు హరీశ్ రావు ఆరోపణలు.. ప్రభుత్వం రియాక్షన్

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:48 PM

కోకాపేట్ నియోపోలిస్‌లోని శారదా పీఠం భూముల వ్యవహారంలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపణలు సంధించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. హరీశ్ రావు వ్యాఖ్యలపై ప్రభుత్వం శనివారం క్లారిటీ ఇచ్చింది.

శారదా పీఠం భూములు హరీశ్ రావు ఆరోపణలు.. ప్రభుత్వం రియాక్షన్

హైదరాబాద్, ఫిబ్రవరి 28: కోకాపేట్ నియోపోలిస్‌లోని శారదా పీఠం భూముల వ్యవహారంలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపణలు సంధించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. హరీశ్ రావు వ్యాఖ్యలపై ప్రభుత్వం శనివారం క్లారిటీ ఇచ్చింది. నియోపోలిస్‌లో జలమండలికి అదనంగా 3.95 ఎకరాల భూమి కేటాయింపు చేసినట్లు వివరించింది. ఇప్పటికే ఉన్న 8.75 ఎకరాలు ఎంబీఆర్ (MBR), ఈఎల్ఎస్ఆర్ (ELSR)ల నిర్మాణానికే సరిపోతాయని స్పష్టం చేసింది.


ఓహెచ్‌టీ (OHT), సైట్ ఆఫీస్, మెయింటెనెన్స్ కోసం అదనపు భూమి అవసరమని జలమండలి ప్రభుత్వాన్ని అభ్యర్థించిందని గుర్తు చేసింది. +592 మీటర్ల ఎత్తులో భూభాగం - గ్రావిటీ ద్వారా నీటి సరఫరాకు అనుకూలమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పంపింగ్ అవసరం లేకుండా నియోపోలిస్, కోకాపేట్ ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతుందని స్పష్టత ఇచ్చింది. బోజగుట్ట రిజర్వాయర్‌కు గోదావరి జలాల గ్రావిటీ సరఫరా చేస్తామని వివరించారు. తద్వారా ఓల్డ్ సిటీ, షేక్‌పేట్, రెడ్ హిల్స్, మెహిదీపట్నం ప్రాంతాలకు లాభం చేకూరుతుందని విశ్వాసం వ్యక్తం చేసింది.


అంతేకాకుండా కరెంట్ ఛార్జీలు భారీగా ఆదా అవుతాయని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇక గోదావరి ఫేజ్-II & III ప్రాజెక్ట్ ద్వారా అదనంగా 300 MGD నీటి తరలింపు లక్ష్యంగా నిర్ణయించినట్లు ప్రభుత్వం క్లారిటీతో వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సౌరశక్తి.. అనాసక్తి

గాదె ఇన్నయ్య తండ్రి మృతి

For More TG News And Telugu News

Updated Date - Feb 28 , 2026 | 12:55 PM