Home » Kokapet Lands
హైదరాబాద్ కోకాపేటలో ప్లాట్లు రికార్డు ధర పలికాయి. నియోపోలిస్ దగ్గర రికార్డు స్థాయిలో ప్లాట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఎకరం రూ.137.25 కోట్లు పలికి రికార్డు సృష్టించింది.
ప్రముఖ హీరో రాజ్‌తరుణ్-లావణ్యల ప్రేమ కథా చిత్రం మళ్లీ.. తెరపైకి వచ్చింది. కోకాపేటలోని పావని విల్లాలోకి అతడి తల్లిదండ్రులు బసవరాజు, రాజేశ్వరి బుధవారం వెళ్లారు. అయితే.. అప్పటికే ఆ ఇంట్లో లావణ్య ఉంటోంది. తాము ఒక గదిలో ఉంటామని వారు పేర్కొన్నారు. కాగా.. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కోకాపేట నియోపోలీసు లేఅవుట్(Kokapet Neopolice Layout)లో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల్లో భాగం గా తాగునీటి సరఫరాకు రిజర్వాయర్‌ను నిర్మాణం చేయనున్నారు.
కోకాపేట(Kokapet)లో ఓ నిర్మాణ సంస్థ జరిపిన బ్లాస్టింగ్స్ తీవ్ర కలకలం రేపింది. నియోపోలీస్ ప్లాట్ నంబర్-3(Neopolis Plot No. 3) వద్ద సినిమా షూటింగ్ తరహాలో ఏకకాలంలో పదిచోట్ల జరిపిన డిటొనేటర్ల(Detonators) పేలుళ్లతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
కోకాపేట్(Kokapet)లో డిటోనేటర్ల బ్లాస్టింగ్స్(Detonators Blast) కలకలం రేపింది. నియో పోలీస్(Neo Police) వద్ద స్థానికులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఓ నిర్మాణ సంస్థ డిటోనేటర్లు పెట్టి పెద్దఎత్తున బండరాళ్లను పేల్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 చోట్ల డిటోనేటర్ల పెట్టి ఆ సంస్థ పేలుడుకు పాల్పడింది.
ఇప్పటికే గ్రేటర్‌గా మారిన హైదరాబాద్‌ను మహా నగరంగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దూరంగా కొత్త నగర నిర్మాణంపై దృష్టిసారించిన సర్కారు.. విస్తరణను వేగవంతం చేసింది.
కోకాపేటలో గత ప్రభుత్వం 11 ఎకరాలు కేటాయించిన వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ బీఆర్‌ఎస్ పార్టీకి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం బీఆర్‌ఎస్ పార్టీకి కోకాపేటలో చేసిన 11 ఎకరాల భూకేటాయింపు చట్ట విరుద్ధమంటూ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది.
కోకాపేటలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఆటో కోసం వేచి చూస్తున్న వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఆటోలో ఎక్కించుకొని మరీ దోపిడీ దొంగలు వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. బాధితుడి జోబులో ఉన్న నాలుగున్నర వేల రూపాయల నగదును తీసుకొని ఆటోలో నుంచి తోసేసి వెళ్లిపోయారు.
గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ పార్టీకి కోకాపేటలో 11 ఎకరాల భూమిని కేటాయించడంపై హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఖరీదైన భూమిని పార్టీ కార్యాలయం కోసం బీఆర్ఎస్‌కు కేటాయించారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) చిక్కుడు ప్రభాకర్ ఈ పిటిషన్ వేశారు.