సచివాలయం వద్ద నిరసనలు సిగ్గుచేటు
ABN , Publish Date - Sep 29 , 2026 | 06:00 AM
రాష్ట్ర పరిపాలనకు కేంద్రంగా ఉండాల్సిన తెలంగాణ సచివాలయం. కాంగ్రెస్ పాలనలో నిరసనలకు అడ్డాగా మారిందని, ఇది సిగ్గుచేటని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఈ దుస్థితికి రేవంత్, భట్టి తలదించుకోవాలి: హరీశ్
హైదరాబాద్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పరిపాలనకు కేంద్రంగా ఉండాల్సిన తెలంగాణ సచివాలయం. కాంగ్రెస్ పాలనలో నిరసనలకు అడ్డాగా మారిందని, ఇది సిగ్గుచేటని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు సచివాలయం వద్ద ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క తలదించుకోవాలని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ.. చిన్న కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడం దారుణం అని, ఏళ్ల తరబడి బిల్లులు పెండింగ్‌లో పెట్టి.. ఎన్నోసార్లు బాధితులు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా.. ఇంకెంతకాలం తప్పించుకు తిరుగుతారు? అని ప్రశ్నించారు.
పెండింగ్ బిల్లుల మంజూరు కోసం 20-30శాతం కమిషన్ డిమాండ్ చేస్తున్నారంటూ గతంలో సచివాలయంలో ఆర్థిక మంత్రి చాంబర్ ముందు బాధితులు ఆందోళనకు దిగారని.. మరి, కమిషన్లు ఇవ్వడం లేదనే బిల్లులు ఆపుతున్నారా? అని ప్రశ్నించారు. రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు విడుదల చేస్తామని మే నెలలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారని గుర్తుచేస్తూ.. మాటలు కోటలు, దాటితే చేతలు గడప కూడా దాటవనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం ఉంటుంది? అని ప్రశ్నించారు. 30ఏళ్లకు పైగా సేవలందించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? వారిగోడు ఈ ప్రభుత్వానికి పట్టదా? అని అడిగారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎక్కడున్నాడో.. ఎం చేస్తున్నాడో..
బీసీ సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యం
Read Latest AP News And Telangana News And International News And Telugu New