హరీశ్‌రావును పక్కన పెట్టిన కేసీఆర్
ABN , Publish Date - Nov 07 , 2026 | 06:40 AM
కేసీఆర్ హరీశ్‌రావును పక్కన పెట్టేశాడని, గడిచిన ఆరు నెలలుగా వారి మధ్య మాటలు కూడా లేవని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు.
దసరా నాడు కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు: చనగాని
ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: వీహెచ్
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ హరీశ్‌రావును పక్కన పెట్టేశాడని, గడిచిన ఆరు నెలలుగా వారి మధ్య మాటలు కూడా లేవని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దసరా రోజున కేసీఆర్ ఆశీస్సుల కోసం వెళ్లిన హరీశ్.. రాత్రి 8 గంటల దాకా ఎదురుచూసినా అపాయింట్‌మెంట్ కూడా దొరకలేదని చెప్పారు. సిద్దిపేట సభలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడైన కేటీఆర్ ఫొటో పెట్టనందుకు హరీశ్‌కు షోకాజ్ నోటీసు జారీ అయిందని, కానీ ఆ విషయం బయటకు రాలేదన్నారు.
మరో రెండు నెలల్లో తెలంగాణలో హరీశ్ మైక్ కట్ కానుందని.. ఎప్పటికైనా ఆయన బీజేపీలో చేరడం ఖాయమని చెప్పారు. తాను బీఆర్‌ఎ్‌సలోనే ఉంటానని హరీశ్ ప్రమాణం చేయగలరా అంటూ సవాల్ విసిరారు. తల్లిదండ్రుల ఆదాయం ప్రాతిపదికన ఓబీసీ అభ్యర్థికి క్రీమీలేయర్‌ను వర్తింపజేయలేమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నానని ప్రభుత్వ సలహాదారు వి.హన్మంతరావు వ్యాఖ్యానించారు. ఈ మేరకు కోర్టుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News