ఏఈఈ పరీక్ష వాయిదా వేయాలి
ABN , Publish Date - Oct 25 , 2026 | 06:50 AM
ఎస్ఎస్సీ జేఈ, టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్షలు ఒకే రోజు జరగనున్న నేపథ్యంలో, నవంబరు 6న నిర్వహించనున్న ఏఈఈ పరీక్షను వాయిదా వేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎస్ఎస్సీ జేఈ, టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్షలు ఒకే రోజు జరగనున్న నేపథ్యంలో, నవంబరు 6న నిర్వహించనున్న ఏఈఈ పరీక్షను వాయిదా వేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డికి శనివారం లేఖ రాశారు. రెండు పరీక్షలు ఒకే తేదీన ఉండటంతో వేలాది మంది ఇంజనీరింగ్ అభ్యర్థులు ఒక పరీక్షకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఎస్ఎస్సీ జేఈ పరీక్ష రాసే అభ్యర్థులు తిరిగి తెలంగాణకు వచ్చి ఏఈఈ పరీక్షకు హాజరుకావడం కష్టమని పేర్కొన్నారు. ఏఈఈ పరీక్ష తేదీని మార్చాలని ఇప్పటికే పలుమార్లు టీజీపీఎస్సీని కోరినా స్పందన లేదని హరీశ్‌రావు లేఖలో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News