Share News

నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - May 02 , 2026 | 08:33 PM

తెలంగాణలో నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం 3.1346 హెక్టార్ల అటవీ భూమిని మళ్లించేందుకు ఆమోదం లభించింది.

నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు గ్రీన్ సిగ్నల్
Nellikal Lift Irrigation Scheme

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు కీలక అనుమతులు లభించాయి. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన 3.1346 హెక్టార్ల అటవీ భూమి మళ్లింపుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో ఎంఎస్ నం.14ను జారీ చేసింది. అలాగే I&CAD శాఖ పేరుమార్పుకు కూడా కేంద్రం అనుమతి ఇచ్చినట్లు సమాచారం. నాగార్జున సాగర్ డివిజన్ పరిధిలో జరుగనున్న ఈ ప్రాజెక్ట్ పనులకు కూడా క్లియరెన్స్ లభించింది. ఇంటేక్ పైప్‌లైన్ నిర్మాణం, పంప్ హౌస్ నిర్మాణాలకు కేంద్ర అటవీ శాఖ అనుమతి ఇచ్చింది.


అటవీ సంరక్షణ చట్టం–1980 ప్రకారం ఈ ప్రాజెక్టుకు తుది గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే పాత షరతులన్నీ యథావిధిగా అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. అటవీ భూమి చట్టపరమైన హోదా యథాతథంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ అనుమతులతో నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకునే అవకాశం ఉంది.


Also Read:

బెంగాల్‌లో కౌంటింగ్‌కు అదనపు పరిశీలకులు.. ఈసీ మరో కీలక నిర్ణయం

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి..

For More Latest News

Updated Date - May 02 , 2026 | 08:34 PM