ఐపీఎల్ 2026: చెన్నై సూపర్ కింగ్స్‌తో కీలక పోరు.. టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్
ABN , Publish Date - May 02 , 2026 | 07:17 PM
ఐపీఎల్ 2026లో మరో కీలక సమరానికి సర్వం సిద్ధమైంది. చెపాక్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ముంబై.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో మరో కీలక సమరానికి సర్వం సిద్ధమైంది. చెపాక్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ముంబై.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే తొలుత ఫీల్డింగ్ చేయనుంది. కాగా ఈ మ్యాచ్‌లో ముంబై లెగ్ స్పిన్నర్ రఘుశర్మ ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఎంఐ-సీఎస్కే మధ్య 40 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఎంఐ 21 గెలవగా, సీఎస్కే 19 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటికే ముంబైతో జరిగిన పోరులో 103 పరుగుల భారీ తేడాతో చెన్నై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటి వరకు 8 మ్యాచులు ఆడిన సీఎస్కే మూడింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మరోవైపు ఆన్నే మ్యాచ్‌లు ఆడిన ముంబై రెండింట్లో గెలిచి 9వ స్థానంలో ఉంది. ఈ పోరు ఇరు జట్లు అత్యంత కీలకం కానుంది.
ముంబై ఇండియన్స్ తుది జట్టు
హార్దిక్ పాండ్య(కెప్టెన్), విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, తిలక్ వర్మ, మింజ్, బౌల్ట్, క్రిష్ భగత్, బుమ్రా, ఘజన్‌ఫర్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: రాజ్ బవా, రఘు శర్మ, మయాంక్ రావత్, శార్దూల్ ఠాకూర్, అశ్వని కుమార్
సీఎస్కే తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), సంజు శాంసన్(వికెట్ కీపర్), ఉర్విల్ పటేల్, బ్రెవిస్, శివం దూబె, ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముకేశ్ చౌదరి
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: కార్తిక్ శర్మ, అకీల్ హుసేన్, సర్ఫరాజ్ ఖాన్, మ్యాథ్యూ షార్ట్, గుర్జప్‌నీత్ సింగ్
ఇవి కూడా చదవండి:
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026: భారత జట్టు ప్రకటన
కర్మన్‌ఘాట్ హనుమంతుడిని దర్శించుకున్న అభిషేక్ శర్మ