కుటుంబ కలహాల విషాదం.. పిల్లలకు కూల్‌డ్రింక్‌లో విషమిచ్చిన తండ్రి
ABN , Publish Date - May 02 , 2026 | 07:20 PM
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం చిన్నరాజుపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కన్న తండ్ర తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చాడు.
నంద్యాల, మే 02: నంద్యాల జిల్లాలోని బనగానపల్లె మండలం చిన్నరాజుపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలకు కూల్‌డ్రింక్‌లో విషమిచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. చిన్నరాజుపాలెంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి కొద్ది రోజులుగా కుటుంబ పరమైన విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మనస్తాపం చెందిన సదరు తండ్రి.. తన ఇద్దరు పిల్లలకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగించాడు. కొద్దిసేపటికే పిల్లలు అస్వస్థతకు గురికావడంతో స్థానికులు గమనించారు. హుటాహుటిన బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నెల్లూరు జిల్లాలో విషాదం..
నెల్లూరు జిల్లా సైదాపురం చెరువుగుంట ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సరదాగా ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన చిన్నారులు.. లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగిపోయారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన చిన్నారులను చందు (13), లక్కీ (12)గా గుర్తించారు. చిన్న వయసులోనే పిల్లలు ఇలా మృత్యువాతపడటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్లకు గ్రీన్ సిగ్నల్
స్వచ్ఛ రథాలకు నేచురల్ స్టార్ నాని సహాయం.. స్పందించిన డిప్యూటీ సీఎంవో..