Share News

సమస్యల పరిష్కారమే పార్టీల లక్ష్యం కావాలి

ABN , Publish Date - Nov 15 , 2026 | 05:00 AM

ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపడమే రాజకీయ పార్టీల ప్రధాన లక్ష్యం కావాలని పలు దేశాలకు చెందిన రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

సమస్యల పరిష్కారమే పార్టీల లక్ష్యం కావాలి
Bharat Summit 2026

  • సిద్ధాంతాల కంటే రోజువారీ సమస్యల పరిష్కారమే ముఖ్యం

  • సమ్మిట్‌లో వివిధ దేశాల రాజకీయ ప్రముఖుల అభిప్రాయం

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపడమే రాజకీయ పార్టీల ప్రధాన లక్ష్యం కావాలని పలు దేశాలకు చెందిన రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. హెచ్‌ఐసీసీలో జరుగుతున్న భారత్‌ సమ్మిట్‌ 2026లో భాగంగా ‘ఇన్నోవేటివ్‌ ఐడియాస్‌ ఫర్‌ ప్రొగ్రెసివ్స్‌’ అనే అంశంపై శనివారం చర్చ జరిగింది.


ఈ చర్చలో స్లోవేనియాలోని డీ-హబ్‌కు చెందిన నికా కొవాచ్‌, అమెరికాలోని సెంటర్‌ ఫర్‌ అమెరికన్‌ ప్రోగ్రె్‌సకు చెందిన జోహాన్‌ హాసెల్‌, థాయ్‌లాండ్‌లోని పీపుల్స్‌ పార్టీ నాయకురాలు కుంతిదా రుంగ్రు ఎంగ్‌కియాట్‌, నార్వేజియన్‌ లేబర్‌ పార్టీ హెడ్‌ ఆఫ్‌ స్ట్రాటజీ ఓయ్‌వింద్‌ వెనెస్లాండ్‌, ఈక్వెడార్‌ కాంగ్రెస్‌ మహిళా సభ్యురాలు మారియా ఇవిగుయేజ్‌, భారత ప్రవీణ్‌ చక్రవర్తి పాల్గొన్నారు. గిగ్‌ వర్కర్ల హక్కులు, ఉద్యోగ భద్రతపై స్పష్టమైన విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సిద్ధాంతాల గురించి మాట్లాడటం కంటే ముందు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడమే రాజకీయ పార్టీల లక్ష్యంగా ఉండాలని ఓయ్‌వింద్‌ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష

విభేదిస్తే దేశ ద్రోహులంటారా?

ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్‌

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 15 , 2026 | 05:00 AM