హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఐటీ ఉద్యోగి మృతి
ABN , Publish Date - Aug 22 , 2026 | 11:03 AM
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐటీ ఉద్యోగి దుర్మరణం చెందాడు. ఖాజాగుడా నుంచి గచ్చిబౌలి వైపుకు వెళ్తుండగా స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద బైక్ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది.
హైదరాబాద్, ఆగస్టు 22: నగరంలోని గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐటీ ఉద్యోగి దుర్మరణం చెందాడు. ముగ్గురు ఐటీ ఉద్యోగులు.. ఖాజాగుడా నుంచి గచ్చిబౌలి వైపుకు వెళ్తుండగా స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద బైక్ అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో పశ్చిమబెంగాల్‌కు చెందిన ఐటీ ఉద్యోగి అబ్బాస్(25) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో అభిరుఫ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందిన వెంటనే రాయదుర్గం పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అలాగే, అబ్బాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అబ్బాస్ మృతి సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
ప్రజలను కన్ఫ్యూజ్ చేయడమే వాళ్ల పని.. జగన్‌పై వర్ల రామయ్య ఫైర్
వెలిగొండ నిర్వాసితులకు పరిహారం.. మూడో విడతగా రూ.250 కోట్ల పంపిణీ
Read Latest Telangana News And Telugu News