ఆర్టీసీ బస్ స్టేషన్లలో ఉచిత వైఫై!
ABN , Publish Date - Nov 11 , 2026 | 06:25 AM
రాష్ట్రంలోని ప్రధాన బస్ స్టేషన్లలో వసతులను మరింత మెరుగుపర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
హైదరాబాద్, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రధాన బస్ స్టేషన్లలో వసతులను మరింత మెరుగుపర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా నిత్యం 5 వేల మందికిపైగా రద్దీ ఉండే 86 బస్ స్టేషన్లను ఇప్పటికే గుర్తించిన ఆర్టీసీ.. వాటిలో దశలవారీగా ప్రయాణికులకు ఉచిత వైఫై సదుపాయం కల్పించనుంది. ఆయా బస్ స్టేషన్లలో ఇప్పటికే ఒక్కొక్కరు చొప్పున కంట్రోలర్లను నియమించడంతోపాటు ప్రయాణికులు బస్సు సర్వీసులు, సమయాల వివరాలను తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేక ఫోన్ నంబర్లు ఏర్పాటు చేసింది. కొత్త బస్సు టైమ్ టేబుల్ బోర్డులను ఏర్పాటు చేయనుంది.
కాగా, ప్రయాణికుల భద్రత కోసం, రద్దీ పర్యవేక్షణను మరింత పటిష్ఠం చేసేందుకు త్వరలో అన్ని బస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. సీసీ కెమెరాల వ్యవస్థను సంబంధిత ప్రాంతీయ, ప్రధాన కార్యాలయాలకు అనుసంధానిస్తారు. ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడానికి ఆర్టీసీ ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని ఎండీ నాగిరెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!
రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్!
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News