Share News

పెట్టుబడుల పేరిట భారీ స్కామ్.. కోట్లు వసూలు చేసి ఆపై..

ABN , Publish Date - Apr 17 , 2026 | 10:56 AM

హైదరాబాద్‌లో పెట్టుబడుల పేరుతో కోట్లు వసూలు చేసిన కేటుగాడిని ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు రమావత్ మధుని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

పెట్టుబడుల పేరిట భారీ స్కామ్.. కోట్లు వసూలు చేసి ఆపై..
Investment Scam

హైదరాబాద్: పెట్టుబడుల పేరుతో కోట్లు వసూలు చేసిన కేటుగాడిని ఆర్థిక నేరాల విభాగం(EOW) పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు రమావత్ మధుని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. రమావత్ మధు, రమావత్ సక్రూ, బండి శివకుమార్‌ కలిసి శుభ క్షేత్ర వెంచర్ ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం దామరగిద్దలో 16 ఎకరాల్లో వెంచర్ అంటూ భారీ ప్రచారం చేశారు.


హైదరాబాద్ మియాపూర్‌లో కార్యాలయం ఏర్పాటు చేసి పలువురిని నమ్మించారు. అనంతరం పెట్టుబడుల పేరిట మోసాలకు దిగారు. డిపాజిట్ స్కీమ్‌తో భారీగా నగదు వసూళ్లకు పాల్పడ్డారు. తమ వెంచర్‌లో రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే 102 గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని.. నెలకు రూ.25 వేలు చొప్పున 42 నెలలపాటు చెల్లిస్తామంటూ మాయమాటలు చెప్పారు. వారిని నమ్మిన 33 మంది నుంచి ఏకంగా రూ.6.58 కోట్లు వసూలు చేశారు. రోజులు, నెలలు గడుస్తున్నా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకపోగా.. ప్రతి నెలా ఇస్తామన్న నగదూ చెల్లించలేదు.


ఇదేంటని ప్రశ్నించిన బాధితులపై బెదిరింపులకు దిగారు మధు అండ్ గ్యాంగ్. దీంతో ఈఓడబ్ల్యూ పోలీసులను బాధితుడు సంతోశ్ ఆశ్రయించాడు. సెప్టెంబర్ 2025లో మధు అండ్ గ్యాంగ్ మాటలను నమ్మి రూ.5 లక్షలు పెట్టుబడిగా పెట్టి మోసపోయినట్లు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ప్రధాన నిందితుడు మధుని అరెస్టు చేశారు. అయితే, శుభ క్షేత్రతోపాటు గోకుల్ నందన ఇన్ఫ్రా సంస్థలకూ మధు డైరెక్టర్‌గా ఉన్నారని విచారణలో తేలింది. శుభ క్షేత్ర వెంచర్ కోసం తీసుకున్న నగదును గోకుల్ నందనలోకి మళ్లించినట్లు గుర్తించారు.


ఈ వార్తలు కూడా చదవండి

డిమాండ్ల పరిష్కారం కోసం నేడు తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ నిరసన

కూలర్ రిపేర్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

Updated Date - Apr 17 , 2026 | 10:56 AM