స్టీఫెన్‌సన్‌కు హైకోర్టులో ఊరట
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:17 AM
బీఆర్‌ఎస్ మాజీ ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. స్టీఫెన్‌సన్‌కు చెందిన భూమికి మాత్రమే వర్తించేలా జీవో 134పై స్టే విధిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆయన భూమిని నిషేధిత జాబితాలో చేరుస్తూ ఇచ్చిన జీవోపై స్టే
హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎస్ మాజీ ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. స్టీఫెన్‌సన్‌కు చెందిన భూమికి మాత్రమే వర్తించేలా జీవో 134పై స్టే విధిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తనతోపాటు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్‌ఎ్‌సకు చెందిన 16 మంది నాయకుల భూములను నిషేధిత జాబితాలో చేరుస్తూ ఇచ్చిన జీవో 134ను కొట్టేయాలని కోరుతూ స్టీఫెన్‌సన్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం..పిటిషనర్ స్టీఫెన్‌సన్‌కు చెందిన స్థలం వరకు జీవో 134పై స్టే విధించింది. వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబరు 2కు వాయిదా పడింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సదర్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక
సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్
బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News