ఎల్‌నినో ప్రభావం.. రబీ పంటలపై జిల్లా కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు
ABN , Publish Date - Nov 13 , 2026 | 05:21 PM
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని.. ఈ నేపథ్యంలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపికలో రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు ఆదేశించారు.
హైదరాబాద్, నవంబర్13: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని.. ఈ నేపథ్యంలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపికలో రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు ఆదేశించారు. రాష్ట్రంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితులపై శుక్రవారం జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రబీ పంటల సాగు కార్యాచరణ ప్రణాళికపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వారికి స్పష్టం చేశారు. అందుకోసం జిల్లాల వారీగా పకడ్బందీగా రబీ సాగు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
నీటి లభ్యత ఆధారంగా పంటల సాగుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎస్ సంజయ్ జాజు తెలిపారు. అలాగే రబీకి అవసరమైన విత్తనాలను ముందుగానే సిద్ధం చేయాలని అన్నారు. కూరగాయలు, పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించాలని వివరించారు. బిందు సేద్యం, సూక్ష్మ సేద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
భూసేకరణ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని వారికి సీఎస్ సంజయ్ జాజు స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను తరచూ తనిఖీ చేయాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పనులు వేగవంతం చేయాలని అన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని వారిని కోరారు. ప్రభుత్వ ప్రాధాన్యతల అమలుపై నిరంతర పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నిమ్స్ పేషెంట్లకు టిమ్స్‌లో సర్జరీలు: మంత్రి రాజనర్సింహ ఆదేశం
కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కెనాల్ ఉందా? దర్యాప్తు చేయాలంటూ కవిత డిమాండ్
Read Latest Telangana News And Telugu News