ఈడీ కస్టడీకి ఈశ్వర్ కిరణ్
ABN , Publish Date - Nov 03 , 2026 | 06:57 AM
వైసీపీ హయాంలో జరిగిన రూ.3,500 కోట్ల లిక్కర్ స్కాం కేసు విచారణలో భాగంగా ఈశ్వర్ కిరణ్ కుమార్‌రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు కస్టడీకి తీసుకున్నారు.
లిక్కర్ స్కాం కేసులో విచారణకు కోర్టు అనుమతి
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన రూ.3,500 కోట్ల లిక్కర్ స్కాం కేసు విచారణలో భాగంగా ఈశ్వర్ కిరణ్ కుమార్‌రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసులో ఈశ్వర్ విచారణకు అనుమతించాలని ఈడీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం రెండు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది.
ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఈశ్వర్‌ను ఈడీ అధికారులు సోమవారం హైదరాబాద్ నాంపల్లి కోర్టులో హాజరుపరిచి తదుపరి విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డికి ఈశ్వర్ అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. నగదు తరలింపులో కీలకపాత్ర పోషించాడని, టెక్కర్ షెల్ కంపెనీ పేరు తో ముడుపులు తరలించినట్లు ఈశ్వర్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. కస్టడీలో ఈశ్వర్‌రెడ్డిని పూర్తిస్థాయిలో విచారించి వివరాలు రాబట్టేందుకు ఈడీ అధికారులు సిద్ధమయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉద్యమంలోకి వెళ్లి జీవితం పాడు చేసుకున్నా!
అమిత్‌షా పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు
సందిగ్ధతకు తావు లేకుండా ఎస్సీ వర్గీకరణ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News