Share News

సామాజిక న్యాయానికి సవాళ్లు!

ABN , Publish Date - Nov 14 , 2026 | 07:09 AM

దేశ జనాభాలో ఒక శాతం మంది చేతుల్లోనే 40ు సంపద కేంద్రీకృతమై ఉందని జార్ఖండ్‌ రాష్ట్ర ఏఐసీసీ ఇన్‌చార్జ్‌.. ఎస్సీ, ఎస్టీ ఓబీసీ, మైనారిటీల విభాగం జాతీయ కో-ఆర్డినేటర్‌ కె. రాజు పేర్కొన్నారు.

సామాజిక న్యాయానికి సవాళ్లు!
Koppula Raju

  • దేశంలో ఆర్ధిక అసమానతలు పెరుగుతున్నాయి: కొప్పుల రాజు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): దేశ జనాభాలో ఒక శాతం మంది చేతుల్లోనే 40ు సంపద కేంద్రీకృతమై ఉందని జార్ఖండ్‌ రాష్ట్ర ఏఐసీసీ ఇన్‌చార్జ్‌.. ఎస్సీ, ఎస్టీ ఓబీసీ, మైనారిటీల విభాగం జాతీయ కో-ఆర్డినేటర్‌ కె. రాజు పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్‌ -వెల్ఫేర్‌ పాలసీలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించేందుకు రిజర్వేషన్లను తీసుకొచ్చినా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోవడంతో రిజర్వేషన్ల ద్వారా లభించే అవకాశాలు కూడా పరిమితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


ఉన్నత విద్య ప్రైవేటీకరణతో పేద విద్యార్ధులకు అవకాశాలు దూరమవుతున్నాయన్నారు. చర్చలో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసిందని వివరించారు. తెలంగాణ అభివృద్ధి అంటే ఫ్లై ఓవర్లు, ఆకాశ హర్మ్యాలు, ఫ్యూచర్‌ సిటీ నిర్మాణాలు మాత్రమేకాదని, సామాజిక న్యాయం, సమానత్వం, సమ్మిళిత వృద్ధి, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కూడా కావాలని బాలల హక్కుల ఉద్యమకారిణి శాంతా సిన్హా అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 07:09 AM