సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదు: దానం నాగేందర్
ABN , Publish Date - Sep 18 , 2026 | 06:30 PM
తనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించడాన్ని స్వాగతిస్తున్నానని దానం నాగేందర్ స్పష్టం చేశారు. తనపై అనర్హత వేటు వేయడంపై శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన స్పందించారు.
హైదరాబాద్, సెప్టెంబర్18: తనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించడాన్ని స్వాగతిస్తున్నానని దానం నాగేందర్ స్పష్టం చేశారు. తనపై అనర్హత వేటు వేయడంపై శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన స్పందించారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని అన్నారు. ఖైరతాబాద్ ఉపఎన్నికలో పోటీకి తాను సిద్ధమని కుండ బద్దలు కొట్టారు. ఎన్నికలు తనకు కొత్త కాదని తెలిపారు. ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా తాను రెడీ అని పేర్కొన్నారు. ఇక్కడి వరకు యుద్ధం చేసే వచ్చానని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో పోరాడతా.. మళ్లీ తాను గెలుస్తానని దానం నాగేందర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
గత అసెంబ్లీలో ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో ఆ పార్టీలో చేరారు. దాంతో దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వేర్వేరుగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారించిన కోర్టు.. దానంపై అనర్హత వేటు వేసింది. దానంపై వేటు వేయడాన్ని బీఆర్ఎస్, బీజేపీ నేతలు స్వాగతిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మళ్లీ సత్తా చాటుతామని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు రానున్న ఉప ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. కేటీఆర్ రియాక్షన్
టీజీఎస్ ఆర్టీసీలో మోగిన ఎన్నికల నగారా
For More TG News And Telugu News