Share News

సుప్రీంకు దానం

ABN , Publish Date - Sep 20 , 2026 | 02:58 AM

పార్టీ ఫిరాయించారంటూ తనపై తెలంగాణ హైకోర్టు వేసిన అనర్హత వేటును సవాలు చేస్తూ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శనివారం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

సుప్రీంకు దానం
Danam Nagender

  • హైకోర్టు అనర్హత వేటుపై స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌

  • ప్రతివాదిగా బీజేఎల్పీ నేత ఏలేటి పేరు

  • రేపు సుప్రీంకోర్టులో ప్రస్తావించే అవకాశం

  • శనివారమే కేవియట్‌ వేసిన ఏలేటి

  • స్పీకర్‌ కార్యాలయానికి హైకోర్టు తీర్పు కాపీ

  • 2 రోజుల్లో ఎన్నికల సంఘానికి సమాచారం?

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పార్టీ ఫిరాయించారంటూ తనపై తెలంగాణ హైకోర్టు వేసిన అనర్హత వేటును సవాలు చేస్తూ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శనివారం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని ప్రతివాదిగా చేర్చారు. ఈ అంశాన్ని సోమవారం దానం నాగేందర్‌ తరపు న్యాయవాదులు సీజేఐ ధర్మాసనం ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. దానం దాఖలు చేసిన ఎస్‌ఎల్పీపై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదనలు వినాలని శనివారం ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కేవియట్‌ దాఖలు చేశారు. తమ వాదనల అనంతరం తీర్పు ఇవ్వాలని కేవియట్‌లో కోరారు.


హైకోర్టు తీర్పు వచ్చిన రోజే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సుప్రీంకోర్టులో కేవియట్‌ వేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన దానం నాగేందర్‌ పార్టీ ఫిరాయించారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ 2024లో స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ అంశంపై విచారణ జరిపిన స్పీకర్‌ ప్రసాదరావు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ చట్ట పరంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదని ఈ ఏడాది మార్చి 11న తీర్పు వెలువరించారు. దీన్ని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి, బీజేపి ఫ్లోర్‌ లీడర్‌ ఏలేటి మహేశ్వర్‌ రెడ్డిలు హైకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సీజే బెంచ్‌ దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసింది.


స్పీకర్‌కు అందిన హైకోర్టు కాపీ

హైకోర్టు తీర్పు కాపీ అధికారికంగా స్పీకర్‌ కార్యాలయానికి చేరింది. స్పీకర్‌ కార్యాలయం తీర్పు కాపీని పరిశీలించి తదుపరి చర్యల నిమిత్తం రెండు రోజుల్లో ఎన్నికల సంఘానికి(ఈసీఐ)కి పంపే అవకాశం ఉంటుందని తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

నిజాం నిరంకుశత్వం తలవంచిన రోజు

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 03:10 AM