Share News

సిలిండర్ బుకింగ్‌లో అపరిచితులకు ఓటీపీ చెప్పొద్దు: ఏసీపీ

ABN , Publish Date - Mar 11 , 2026 | 02:48 PM

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. దీని ప్రభావం ఆయిల్, గ్యాస్ రంగాలపై పడింది. ఈ నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది.

సిలిండర్ బుకింగ్‌లో అపరిచితులకు ఓటీపీ చెప్పొద్దు: ఏసీపీ

హైదరాబాద్, మార్చి 11: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. దీని ప్రభావం ఆయిల్, గ్యాస్ రంగాలపై పడింది. ఈ నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది. అలాంటి వేళ ఈ సిలిండర్ గ్యాస్‌ కొరతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని ప్రజలను సైబర్ క్రైమ్ ఏసీపీ శివ మారుతి హెచ్చరిస్తున్నారు. అందుకోసం నకిలీ ఎల్పీజీ బుకింగ్ వెబ్ సైట్లను సైబర్ నేరగాళ్లు ఓపెన్ చేస్తున్నారని తెలిపారు.


బుధవారం హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విలేకరితో ఏసీపీ శివ మారుతి మాట్లాడుతూ.. ఈ వెబ్ సైట్ల ద్వారా త్వరగా గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తామని ప్రకటనలు చేస్తు్న్నారని చెప్పారు. సదరు ప్రకటనలు నమ్మి గ్యాస్ సిలిండర్ బుక్ చేసి మోసపోయే అవకాశం ఉందని ప్రజలకు స్పష్టం చేస్తున్నారు. అపరిచిత వ్యక్తులు పంపే వెబ్ సైట్ల లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధికృత ఎల్పీజీ వెబ్ సైట్‌లో మాత్రమే సిలిండర్లు బుక్ చేసుకోవాలని గ్యాస్ వినియోగదారులకు సూచిస్తున్నారు.


త్వరగా సిలిండర్ సప్లై చేస్తామని అంటే.. అది మోసమని గ్రహించాలని పేర్కొన్నారు. సిలిండర్ బుకింగ్ పేరిట అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు చెప్ప వద్దంటూ గ్యాస్ వినియోగదారులకు స్పష్టం చేశారు. ఈ తరహా మోసాలకు ఎవరైనా గురైయితే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సైబర్ క్రైమ్ ఏసీపీ శివ మారుతి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.. కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నా: కడియం శ్రీహరి

ప్రధాని ఎప్పటికీ రాజీపడరు.. రాహుల్‌పై విరుచుకుపడిన రవిశంకర్ ప్రసాద్

For More TG News And Telugu News

Updated Date - Mar 11 , 2026 | 05:41 PM