Share News

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే సీపీఐ మద్దతు

ABN , Publish Date - Nov 05 , 2026 | 06:15 AM

రానున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రె్‌సకే తమ మద్దతు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే సీపీఐ మద్దతు
Congress, CPI

  • ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని ప్రకటన

హైదరాబాద్‌, నవంబరు4 (ఆంధ్రజ్యోతి): రానున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రె్‌సకే తమ మద్దతు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. కాంగ్రెస్‌ నాయకులు సీపీఐ కార్యాలయానికి వచ్చి మద్దతు కోరారని, పార్టీ అంతర్గత చర్చల అనంతరం రాజకీయ పరిస్థితులను పరిశీలించాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బుధవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో పార్టీ నేతలతో కలిసి కూనంనేని మాట్లాడారు. యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరినట్లు చెప్పారు. తెలంగాణలో అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లు పార్టీలకు అతీతంగా కేటాయించాలని కోరామన్నారు. వీటన్నింటిపై సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు.


నీటికొరత పేరుతో విద్యాసంస్థలకు సెలవులిస్తారా?: ఏఐఎస్ఎఫ్‌

తాగునీటి కొరత పేరుతో పలు విద్యాసంస్థలు, వసతి గృహాలకు యాజమాన్యాలు సెలవులు ప్రకటిస్తుండటంపై ఏఐఎస్ఎఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. బోరు నీరు రాకపోతే ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించి విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా చూడాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఏఐఎస్ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్టా లక్ష్మణ్‌ మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సదర్‌ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక

సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్

బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 06:15 AM