Share News

డప్పు కొడితే.. కేసీఆర్ ఫాంహౌస్ మైలపడిందా?: అద్దంకి దయాకర్

ABN , Publish Date - Sep 10 , 2026 | 09:34 AM

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలకు ఎందుకంత కడుపుమంట అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై దాడులకు ఫాంహౌస్‌ నుంచి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

డప్పు కొడితే.. కేసీఆర్ ఫాంహౌస్ మైలపడిందా?: అద్దంకి దయాకర్
Congress MLC Addanki Dayakar

హైదరాబాద్, ఆగస్టు 10: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. డప్పు కొడితే.. కేసీఆర్ ఫాంహౌస్ మైలపడిందా? అని బీఆర్ఎస్ పార్టీ నేతలను సూటిగా ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలకు ఎందుకంత కడుపుమంట అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌కు అసెంబ్లీతో పని లేదు.. ప్రజలతో పనిలేదని ఎద్దేవా చేశారు. దళితులపై దాడులకు ఫాంహౌస్‌ నుంచి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వాళ్లే తప్పులు చేసి.. తమపై నిందలు వేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ నిప్పులు చెరిగారు.


తెలంగాణ అసెంబ్లీ వర్షా కాల సమావేశాలు.. సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమయాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలన విఫలమంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నిరసనకు పిలుపునిచ్చింది. దాంతో నల్ల టీ షర్టులు ధరించి అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ అగ్రనేతలు నిరసనలు తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, విజయ్ కుమార్ రెడ్డి.. అసెంబ్లీ స్పీకర్‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.


ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఎర్రవెల్లిలోని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఫాంహౌస్‌ వద్ద వెయ్యి డప్పుల మోతకు పిలుపునిచ్చింది. ఆ క్రమంలో వెయ్యి డప్పులు మోత కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆ ప్రదేశాన్ని బీఆర్ఎస్ శ్రేణులు శుద్ధి చేశాయి. బీఆర్ఎస్ చర్యను కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ చర్యపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ప్రారంభం నాటి నుంచి ఎర్రవెల్లిలో శుద్ధి కార్యక్రమం వరకు అంతా ఫాంహౌస్ వేదికగా జరిగిన కుట్ర అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

చిన్నారిని కోతి ఎలా ఆడించిందో చూశారా?.. వీడియో వైరల్

అడవిలో రాత్రంతా ఒంటరిగా..!

For More TG News And Telugu News

Updated Date - Sep 10 , 2026 | 09:59 AM