చిన్నారిని ముద్దు చేసి ఆడించిన కోతి.. వీడియో వైరల్
ABN , Publish Date - Sep 10 , 2026 | 08:15 AM
పసి పిల్లలు దేవునితో సమానం అంటారు. ఎవరు పలకరించినా.. కాళ్లు చేతులు ఊపుతూ బోసి నవ్వులు చిందిస్తారు. ఓ చిన్నారిని కోతి ముద్దు చేసి ఆడిస్తుంది. ఆ వీడియో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: పసి పిల్లలు దేవునితో సమానం అంటారు. ఎవరు పలకరించినా.. కాళ్లు చేతులు ఊపుతూ బోసి నవ్వులు చిందిస్తారు. ఓ చిన్నారిని కోతి ముద్దు చేసి ఆడిస్తుంది. అచ్చం మనుషులు ఎలా చిన్న పిల్లలను ఆడిస్తారో.. అలాగే కోతి ఆడిస్తుంది. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏడాదికి కాస్తా అటు ఇటుగా వయస్సు ఉన్న చిన్నారి మంచంపై పడుకుని ఉంది. ఆ పక్కనే కోతి కూర్చొని ఉంది. ఆ చిన్నారిని కోతి ముద్దు చేస్తూ.. ఆడిస్తుంది. దీంతో చిన్నారి కాళ్లు, చేతులూ ఊపుతూ కేరింతలు కొడుతోంది.
కోతి తన తలను ఊపుతూ చిన్నారిని నవ్వించే ప్రయత్నం చేస్తుంది. ఆ చిన్నారి ఛాతీపై కోతి ముద్దు పెడుతోంది. కోతి ఇలా చేస్తున్నప్పుడు ఆ చిన్నారి ఎక్కడా భయపడిన దాఖలాలు లేవు. చిన్నారి కాళ్లు చేతులు ఊపుతుంటే.. వాటిని కోతి పరిశీలనగా గమనిస్తోంది. ఈ మొత్తం వీడియోలో కోతి ఒక్కసారి మాత్రమే చిన్నారిపై పొట్టపై నుంచి చెయ్యి తీసింది. ఈ వీడియోను ashwin07282 అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు15 లక్షల మందికిపైగా వీక్షించి, లైక్‌లు చేశారు.
ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. నిజమైన, స్వచ్ఛమైన ప్రేమ, నమ్మకం అంటే ఏమిటో ఈ చిన్న జీవి మనకు నేర్పిందని కామెంట్ చేశారు. ఈ రోజుల్లో ప్రజలు ఒకరికొకరు దూరమవుతున్నారు.. ప్రేమకు భాష, హద్దులు లేవని ఈ వీడియో నిరూపిస్తుందని తెలిపారు.