Share News

పాము కాటేయడానికి దూసుకొచ్చినా తగ్గలేదు.. ఒట్టి చేతులతో..

ABN , Publish Date - Sep 10 , 2026 | 09:04 AM

పాము కనిపిస్తేనే చాలామంది ఆమడ దూరం పారిపోతారు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఏ మాత్రం భయపడకుండా పామును పట్టుకునేందుకు ప్రయత్నించాడు. పాము తప్పించుకునేందుకు అటూ ఇటూ కదులుతూ, పదేపదే దాడి చేసేందుకు ప్రయత్నించినా.. చివరకు దాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..

పాము కాటేయడానికి దూసుకొచ్చినా తగ్గలేదు..  ఒట్టి చేతులతో..
Cobra Snake Viral Video

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా పాము కనిపిస్తే దాని దగ్గరకు వెళ్లేందుకు కూడా ప్రజలు భయపడతారు. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఒట్టి చేతులతో నాగు పామును పట్టుకునేందుకు ప్రయత్నించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఓ వ్యక్తి ఎంతో జాగ్రత్తగా పాము వద్దకు వెళ్లడం కనిపిస్తుంది. పాము అతడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంది. అదే సమయంలో ఆ వ్యక్తిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ అతను వెనక్కి తగ్గకుండా పామును పట్టుకునేందుకు పలుమార్లు ప్రయత్నించాడు. కొద్దిసేపు ఉత్కంఠభరితంగా సాగిన ఈ ప్రయత్నంలో చివరకు అతడు పామును పట్టుకున్నాడు. అనంతరం దానిని కెమెరాకు చూపిస్తూ కనిపించాడు. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు.


ఈ వీడియోను ‘జిలానిముల్లా’ అనే పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినట్లు తెలుస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు.. ‘ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎలాంటి సినిమాటిక్ స్టంట్స్ లేకుండా నిజమైన పరిస్థితిని చూపించడంతో ఈ వీడియో మరింత ఆసక్తిని రేపుతోంది. అయితే పాములను గుర్తించకుండా వాటి దగ్గరకు వెళ్లడం.. స్వయంగా పట్టుకోవడానికి ప్రయత్నించడం అత్యంత ప్రమాదకరం. పాము విషపూరితమైనదా కాదా తెలియకపోవడంతో ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో సాహసం చేయకుండా వెంటనే శిక్షణ పొందిన స్నేక్ క్యాచర్లు లేదా సంబంధిత నిపుణుల సహాయం తీసుకోవడం మంచిదని అంటున్నారు.


ఇవి కూడా చదవండి:

మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్‌ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..

మద్యం అమ్మకాలపై ‘ఏఐ’ నిఘా!

Updated Date - Sep 10 , 2026 | 10:38 AM