వాస్తవాలు తెలుసుకోవడానికే వచ్చాం.. భూములు లాక్కెళ్లడానికి రాలేదు: కాంగ్రెస్ నేతలు
ABN , Publish Date - Sep 18 , 2026 | 05:46 PM
మాజీ మంత్రి హరీశ్ రావు మాటలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. అక్రమభూముల వ్యవహారంపై ప్రజలకు అవగాహన కల్పించడానికే సిద్ధిపేటకు వచ్చామని.. ఎవరి భూములూ లాక్కోవడానికి రాలేదని ఎద్దేవా చేశారు.
సిద్ధిపేట, సెప్టెంబర్ 18: మాజీ మంత్రి హరీశ్ రావు మాటలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. భూ అక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికే సిద్ధిపేటకు వచ్చామని.. ఎవరి భూములూ లాక్కోవడానికి రాలేదన్నారు.
‘హరీశ్ రావుపై మాకు నమ్మకం లేదు.. దాడులు చేసే సంస్కృతి బీఆర్ఎస్ నేతలది.. వారి బుద్ధి తెలిసే సెక్యూరిటీతో వచ్చాం.. వాస్తవాలపై అధ్యయనం చేద్దామని సిద్ధిపేట వచ్చాం కానీ.. ఎవరి భూములు లాక్కెళ్లాలనే ఉద్దేశంతో రాలేదు.. ’ అని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
హరీశ్ రావు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు. హరీశ్ రావు తన ఫాంహౌస్ చుట్టూ.. సుడా పార్క్ పేరిట రక్షణ కంచె ఏర్పాటు చేసుకున్నారని దయాకర్ ఆరోపించారు. ఈ పార్క్ కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం రూ.6 లక్షల పరిహారం ఇస్తే.. హరీశ్ రావు వారికి రూ. 2.5 లక్షలు ఎలా ఇచ్చారని దయాకర్ ప్రశ్నించారు. సిద్ధిపేటలో జరుగుతున్న భూ కబ్జాల గురించి ప్రజలకు వివరించడమే తమ పర్యటన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
కాగా.. కాంగ్రెస్ నేతల సిద్ధిపేట పర్యటన నేపథ్యంలో.. హరీశ్ రావు స్పందించారు. ‘నేను ఇక్కడే ఉన్నా కదా.. నాకు చెబితే నేనే దగ్గరుండి.. నా భూములు చూపించేవాడినిగా.. దానికి వందల మంది పోలీసుల, సెక్యూరిటీతో రావాలా..’ అని అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు హరీశ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మొదట ఓట్ చోరీ.. ఇప్పుడు పార్టీ చోరీ: రాహుల్ గాంధీ
దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్.. ఎండీఎల్‌తో ఏపీ సర్కార్ ఎంవోయూ
For More AP News And Telugu News