22ఏపై ఏం చేద్దాం?
ABN , Publish Date - Sep 13 , 2026 | 04:21 AM
రాష్ట్రంలో తీవ్ర వివాదస్పదంగా మారిన 22ఏ (నిషేధిత భూమూల జాబితా) అంశాన్ని తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గత తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో ...
16న అసెంబ్లీలో సీఎం కీలక ప్రకటన
బీఆర్‌ఎస్ పాలనలో అక్రమాలపై విచారణ!
ధరణి రాకతో మారిన నిషేధిత జాబితా
కోర్టు ఆదేశాలతో అప్‌లోడ్
చేసినప్పుడే తప్పుల తడక
దీనిపై స్పష్టత ఇచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తీవ్ర వివాదస్పదంగా మారిన 22ఏ (నిషేధిత భూమూల జాబితా) అంశాన్ని తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గత తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో ఈ నిషేధిత జాబితా కేంద్రంగా జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలా...? లేక ఇప్పటికే ప్రాథమికంగా వెలుగుచూసిన అంశాల ఆధారంగా చర్యలకు ఉపక్రమించాలనే అనేదానిపై ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈనెల 16న(బుధవారం) శాసనసభ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి 22ఏ సమస్య పరిష్కాం, భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రకటన చేయనున్నారు. దీనికి ముందురోజు మంగళవారంనాడు మంత్రులు, అధికారపక్ష ఎమ్మెల్యేలతో సీఎం ప్రత్యేకంగా సమావేశమై సమగ్రంగా చర్చించనున్నారు.
రాష్ట్రంలో ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తరువాత రూపొందించిన 22ఏ జాబితాను.. హైకోర్టు ఆదేశాల మేరకు 2025 డిసెంబరు 3న ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ సమయంలోనే భారీగా పొరపాట్లు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఉమ్మడి రాష్ట్రం నుంచే ఉన్న 22ఏ భూసమస్యలను బీఆర్‌ఎస్ తన తొమ్మిదిన్నరేళ్ల పాలనలో పరిష్కరించి ఉంటే.. నేడు రాష్ట్రంలో భూయజమానులకు, రైతులకు ఈ పరిస్థితి వచ్చేదే కాదని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. 22ఏ భూముల విస్తీర్ణంపై అధికారులు ప్రభుత్వానికి సమర్పించిన గణాంకాలు విస్తుగొలుపుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి (2023 డిసెంబరు 7) 22ఏ నిషేధిత జాబితాలో 1,02,52,690 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి ఆ విస్తీర్ణం 1,02,05,250 ఎకరాలకు తగ్గింది. అంటే ఈ కాలంలో నిషేధిత జాబితా నుంచి 47,440 ఎకరాల విస్తీర్ణం నికరంగా తగ్గగా.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ భూవిస్తీర్ణం పెరిగిందని ప్రచారం చేస్తుండడంతో, దీనిపై ప్రజలకు వాస్తవాలను వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో సీఎం చేసే కీలక ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
22ఏలో దొరల దోపిడీ
నీళ్లియ్యమని నన్ను అడగొద్దు
Read Latest AP News And Telangana News And International News And Telugu News